అగ్రరాజ్యం అమెరికాకి జీవితంలో అవకాశం వస్తే ఒక్కసారైనా వెళ్లాలని కలలు కంటుంటారు. మరి కొందరు అయితే... నాకే రెక్కలు ఉంటే హాయిగా ఎగురుకుంటూ పోయి అమెరికాలో వాలిపోయేవాడ్ని అనుకుంటుంటారు. కారణం అమెరికా అంటే భూతల స్వర్గం. అక్కడి జీవితం సర్వ సుఖాల మయం. వీటిని జీవితంలో ఒక్కసారైనా అనుభవించితే చాలు అనుకుంటారు. అయితే అలా కళలు కనే వాళ్ళు ఒక్క మనదేశంలోనే కాదు... ప్రపంచంలోని చాలా దేశాల్లోని ప్రజలు ప్రజలు అమెరికా గురించి కలలు కంటున్నారని తాజాగా గ్యాలప్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో ప్రపంచంలో దాదాపు 10 కోట్ల మంది అమెరికాలో సెటిల్ కావాలని, డాలర్లకు డాలర్లకు సంపాదించాలని అనుకుంటున్నారట. ఇక్కడవిశేషం ఏంటంటే... పదికోట్ల మందిలో కోటి మంది మన భారతీయులే ఉన్నారంటే... మన దేశం వాళ్లు అగ్ర రాజ్యం అమెరికా పై ఎంత ఆసక్తి చూపిస్తున్నారో అర్థం అవుతుంది. అక్కడి అందమైన రోడ్లు, ఆకాశ హర్మాలు, ఆకర్షణీయమైన వస్తువులు నర్తన చేస్తూ కనిపిస్తాయి. జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనా ఈ విషయంలోనూ ముందంజలో ఉంది. దాదాపు 1.9 కోట్లమంది చైనీయులు 'మాకు అమెరికాలో స్థిరపడాలని ఉంది' అని తెలిపారు. తరువాతి స్థానంలో నైజీరియా పోటీ పడుతోంది. ఆ దేశం నుంచి కోటీ 30 లక్షల మంది అమెరికాపై మోజు పడుతున్నారు.
ఇక భారత్ నుంచి కోటి మంది, బ్రెజిల్, బంగ్లాదేశ్‌ల నుంచి 60 లక్షల మంది చొప్పున అమెరికాలో స్థిరపడాలని కోరుకుంటున్నారు. అమెరికాలో ఎంత ఆకర్షణ లేకుంటే, అన్ని ఖండాలనుంచి, అనేక దేశాలవారు తమ బ్రతుకుతెరువు కోసం అక్కడకు పరుగులు పెడుతూ అక్కడే సెటిల్ అవటానికి ప్రయత్నిస్తారు మీరే చెప్పండి. అలా అగ్రరాజ్యంలో ఆకలి కేకలు, నిరుద్యోగం, పేదరికం వంటివి లేవని భ్రమపడితే... మనం ఊహాల తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇటీవల అక్కడి వ్యవసాయ శాఖ వారు వెల్లడించిన వివరాల్లో నాలుగున్నర కోట్లమంది ఆకలితో అల్లాడుతున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. దూరపు కొండలు యమా నున్నగా వుంటాయి అని పెద్దలు ఇందుకే అన్నారేమో అనిపిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more