International womens day

international womens day, women safety, woman rights

international womens day

womens-day.png

Posted: 03/08/2013 11:53 AM IST
International womens day

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 

ఈరోజు ప్రత్యేకతలు- బాలికలు, మహిళల దినోత్సవం, మహిళలకు సమాజంలో గుర్తింపు, లైంగిక వేధింపుల నుండి రక్షణ, వివక్ష నుంచి విడుదల.

సభ్య సమాజం ఏర్పడి, నాగరికత వెల్లివిరిసిన ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ మహిళల పట్ల నిరాదరణ, వారు వివక్షకు గురవటం మానవాళికే సిగ్గుచేటు.  ఇది అభివృద్ధి ఎలా అవుతుంది.  దేశ రాజధానిలోనే మహిళలకు రక్షణ లేదని తేలిపోయింది.  మహిళలను వేధించటానికి, అవమానపరచటానికి, అమానుషంగా ప్రవర్తించటానికి, చివరకు వారిని హతమార్చటానికి కూడా సిద్ధమైనవారు బయట రోడ్ల మీద, కార్యాలయాల్లో, ఇళ్ళల్లో, బళ్ళల్లో, చివరకు గర్భంలో కూడా వారికి రక్షణ లేకుండా చేస్తున్నారు.  కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసిన దగ్గర్నుంచీ, మరణించి మట్టిలో కలిసిపోయేంత వరకూ స్త్రీకి రక్షణ కరువైందంటే మనం ఏం ప్రగతిని సాధించినట్టు.  ఏం చేసినా, ఎంత చేసినా స్త్రీల నుంచి ఇంకా ఏదో ఆశించేవారు తమ పైశాచిక ఆనందాల కోసం ఏం చెయ్యటానికైనా వెనకాడరని చెప్పటానికి వెలుగు చూసిన ఉదంతాలే ఎన్నో ఉన్నాయి.

మహిళా సంఘాల వలన, సంఘ సంస్కర్తల వలన మార్పు వచ్చిందన్నది కూడా నిజమే కానీ, కలగాల్సిన మార్పు ఇంకా చాలా ఉంది.  అంటే, కలగవలసినంత ప్రమాణంలో మార్పులు సంభవించలేదు.  సమాజంలో సమాన హోదాను పొందటానికి తీసుకున్న చర్యల్లో అందరికీ విద్య, ఆస్తిలో సమాన హక్కులు, ఉద్యోగాలలో ఎక్కువ అవకాశాలు, ఆర్థిక స్వాతంత్ర్యం కోసం తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కొంత మెరుగు పరచినా, మహిళల పట్ల ఇంకా అన్యాయం జరుగుతూనేవుంది.

పార్లమెంటులో మహిళా బిల్లులను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టటం జరుగుతోంది కానీ, సభల చివర్లో వాటిని ప్రవేశపెట్టి మార్కులు కొట్టేయటానికి, రాజకీయ లబ్ధికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి కానీ నిజంగా మహిళోద్ధరణకు నడుంకట్టే చర్యలు తీసుకోవటం లేదంటూ మహిళా సంఘాలన్నీ ఆరోపిస్తున్నాయి.

బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన విధంగా, నిర్భయ మొబైల్ సేవలందించే వాహనాలు విడుదలయ్యాయి.  మంచిదే కానీ అసలు శత్రువుల ఎక్కడున్నారో పసిగట్టి, ముందుగా వారిలో మార్పుని తీసుకుని రావాలి.  మహిళలకు శత్రువులు కేవలం బయటే లేరు ఇంటిలోనూ ఉన్నారు, సహోద్యోగులలో ఉన్నారు, సహవాసులలో ఉన్నారు, సహ ప్రయాణీకులలో ఉన్నారు,  వారిని హతమార్చటం కాదు వారందరిలోనూ పరివర్తన తీసుకుని రావటమే మార్గం.  స్త్రీల మీద వివక్ష చూపించేవారిలో పురుషులే కాదు స్త్రీలు కూడా ఉన్నారు.  బయట ఎక్కడో కాదు ఒక్కోసారి ఇంట్లోనే ఉంటున్నారు.  బలవంతపు పెళ్ళిళ్లు,  కట్న వేధింపులు ఇంటి బయట ఉన్నవి కావు.

మహిళల మీద అవగాహన రావటమే ప్రధానం.  పురుషులు, మహిళలూ ఇద్దరూ సమాజంలో సమానమైన హోదా కలవారే అని అర్థం కావాలి.  మనసుల్లోకి ఇంకాలి.  వినోదానికి, సేవలు చెయ్యటానికే స్త్రీ అవసరం ఉందనే భావాన్ని కలిగించే పదజాలాన్ని బహిష్కరిస్తూ, సమాచార మాధ్యమాలలో, ముఖ్యంగా సినిమాలలో ఎన్నుకునే కథా వస్తువుల్లో మార్పు రావాలి.  కులాల పేరుతో తిట్టటాన్ని బహిష్కరించినట్టుగానే మహిళపట్ల అగౌరవం కలిగించే భాషాప్రయోగాలను అరికట్టాలి.  ఉదాహరణకు సినిమాలలో, అమ్మాయిని పడెయ్యటం, పెళ్ళి చేసుకుని పిల్లను తీసుకుని రావటం లాంటి మాటలు రాయగూడదు.  మనం వాడే భాషనుబట్టే మన ఆలోచనలుంటాయి, అవి ఎన్నో చిరకాలం ఉండే లోతైన ముద్రలు వేస్తాయి.

బయట దాక్కున్న శత్రువుల నుంచి మహిళలకు రక్షణ కల్పించవచ్చునేమో కానీ హృదయాలలో దాక్కుని అవకాశం కోసం పొంచి చూసే శత్రువులనుంచి కాపాడాలంటే కావలసినవి రక్షణ ఏర్పాట్లు కావు, అవగాహన, కలగాల్సింది ఙానం.  తన ఇంటి ఆడవాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే ఆవేశం, వేరెవరి విషయంలోనైనా ఆలోచించేటప్పుడు రాదెందుకని.

ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం మీద దేశవ్యాప్తంగా స్పందన రావటం నిజంగా సమాజంలో మార్పే అని కొందరు సంతోషపడుతున్నారు కానీ, రోడ్డు మీద పడివున్న ఆ మహిళను ఆ సమయంలో అందరూ చూస్తూ వెళ్ళిపోయారే కానీ కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఆ అమ్మాయికి సాయం చెయ్యటానికి ఎవరూ రాలేదన్న విషయం కలతపెడుతుంది.  సమాచార మాధ్యమంలో కలిగిన అభివృద్ధే జాతీయ స్థాయిలో స్పందనకు అసలు కారణం.  

గురజాడ అప్పారావు గుడిపాటి వెంకట చలం లాంటి సంస్కర్తలు తమ రచనల ద్వారా ఆలోచనల్లో పరివర్తనైతే తీసుకుని వచ్చారు కానీ, ఇప్పటికీ మహిళలకు గౌరవమివ్వటానికి బయటకు ఒప్పుకున్నట్టే కనిపించినా, మహిళ అంటే ఎక్కడో లేదు, తన ఇంటిలోనే ఉంది, తనకు జన్మనిచ్చినావిడ కూడా మహిళే అని ఎప్పుడూ గుర్తుంచుకోకపోవటం, స్త్రీ పట్ల వివక్ష మాత్రం వీడిపోవటం లేదు.  

పేపర్లో ఏ వార్తను ఎవరు చదవుతున్నారన్నది కేవలం ఊహించగలమంతే.  ఎన్నో వార్తలను పైపైనే శీర్షికల వరకే చదివి వదిలేసేవారు కూడా మహిళ పట్ల అత్యాచారం అని కనపడితే పూర్తిగా చదవుతారు.  వార్త ఉన్నది చదవటానికే కానీ ఎంత ఆసక్తిగా చదువుతున్నారో చూస్తే వారి మనోస్థాయి అర్థమవుతుంది.  పేపర్లలో వార్తలు ఎందరు చదివారన్నది తెలియదు గానీ, అంతర్జాల పుణ్యమాంటూ ఏ వార్త ఎంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుందో దానికి వచ్చిన హిట్స్ వలన తెలిసిపోతుంది.  జరిగిన అకృత్యాన్ని సవివరంగా రాసిన వార్తలకు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు.  అంటే నిజమైన శత్రువు ఎక్కడున్నాడో మీకే అర్థమవుతుంది.  

మహిళా, ఇంకా వేచి చూడాల్సిందేనమ్మా.  ఎంతకాలం పడుతుందో చెప్పటం కష్టమే.  ఇది నిరాశావాదం కాదు.  పచ్చి నిజం.  ప్రస్తుత సమాజంలో మహిళకున్న స్థాయిని చూసి వేసే అంచనా.  స్థాయి అంటే ఆర్థిక, సమాన హోదా, సమాన అవకాశాలు ఇవి కావు-  మానవాళి మనసు పొరల్లో మహిళకు స్థానమిచ్చి కూర్చోబెట్టిన రహస్య స్థలం.  ఏ చట్టాలూ, ఏ భద్రతా చర్యలూ అందుకోలేని చోటు.  అక్కడ రావాలి మార్పు.  మానవులు మానసికంగా ఎదగాలి.  అంత వరకూ ఇంతే! ఐమ్ సారీ!

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sehwag dropped from remaining two tests no replacement named
Amir khan got old radio from chor bazar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more