ఢిల్లీలో తెలంగాణ తీన్మార్ రచ్చ జరుగుతుంది. కాంగ్రెస్ ముఖ్యనేతలతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సమావేశమయ్యారు. హోమంత్రి షిండే, వయలార్ రవి, గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్ లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమవేశంలో తెలంగాణ పై అయిదు ఆప్షన్లను సోనియా గాంధీ ముందు ఉంచారు. తెలంగాణ పై ఈ నెల 28న లోపు కేంద్ర నిర్ణయం చెప్పటానికి సోనియా గాంధీ కసరత్తు చేస్తుంది. సీమాంధ్ర, తెలంగాణ నేతల వాదనలను మరోసారి విన్న హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఓ నివేదికను సోనియాకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నివేదికతోనే సోనియా రాష్ట్ర విభజన అంశంపై నిర్ణయం తీసుకోబోతున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీతో తెలంగాణకు అనుకూలంగా చేసిన తీర్మానాన్ని తెలంగాణ ఎంపీలు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. షిండే ఈ అంశాన్ని కూడా తన నివేదికలో చేర్చినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల ద్వారా హోంశాఖ మంత్రి షిండే తయారు చేసిన నివేదిలో సోనియా ముందు ఐదు అంశాలను షిండే ఉంచినట్టు తెలుస్తోంది. సోనియా ఈ ఐదు ఆప్షన్లతో ఏదో ఒకటి ఫైనల్ చేసి హోంమంత్రి షిండేకు తెలియజేస్తారని కేంద్ర నాయకులు అంటున్నారు.
సోనియా గాంధీ సూచించిన విధంగానే షిండే ఈనెల 27న అభిప్రాయాన్ని వెల్లడిస్తారని తెలుస్తోంది. అమ్మ ముందు ఉన్న ఆప్షన్లు అయిదు ఆప్షన్లు ఏమిటి? అనేది రాష్ట్ర నాయకులు తర్జనభర్జనపడుతున్నారు. రాష్ట్రం నుండి ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర నాయకులకు అక్షింతాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇరుప్రాంతాల నాయకులపై ఢిల్లీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇంతకీ అమ్మ ముందు ఉన్న అయిదు హస్త్రాలు ఏమిటి? వాటి వలన తెలంగాణ సమస్య తీరుతుందా? రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందా? ఇరు ప్రాంతాల నాయకులు సమ్మతి తెలుపుతారా? అనే ప్రశ్నలు ఢిల్లీ నాయకులను వణికిస్తున్నాయి. అసలు ఇంతకీ అమ్మ హస్తంలో ఉన్న అయిదు బాణాలు ఏమిటి?
అ) తెలంగాణ కు ప్రత్యేక మండలి, బోర్డు, నిధులు: ఇక మూడో ప్రతిపాదనలో భాగంగా తెలంగాణకు ప్రత్యేక అభివృద్ధి మండలితోపాటు బోర్డు, నిధులు ఇవ్వడం. ఈ ప్రతిపాదనపై కేంద్రం ఆలోచించినా తెలంగాణ ఎంపీలు మాత్రం వ్యతిరేకించారు.
ఆ) రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం: సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, ఎంపీలు, మంత్రులు డిమాండ్ చేస్తున్నట్టుగా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచడం.
ఇ) రాష్ట్రాన్ని విభజించడం: 2009 డిసెంబర్ 9 తెలంగాణ ఇస్తామని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణవాదులు రాష్ట్రం కోసం ఆందోళన చేస్తూనే ఉన్నారు. దీంతో సోనియా కూడా ఈ ఆందోళనలను గుర్తించినట్టు తెలుస్తోంది.
ఈ) గుర్ఖాల్యాండ్ తరహా కౌన్సిల్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గుర్ఖాల్యాండ్ రాష్ట్ర ఏర్పాటుకు విరుగుడుగా కేంద్రం సూచించిన స్వయం పాలక మండలిని ఇక్కడ కూడా ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అంశాన్ని తెలంగాణ వాదులు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించరు.
ఉ) రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం: సీమాంధ్రకు చెందిన లగడపాటి లాంటి కొందరు ఎంపీలు చేసిన డిమాండ్ ఇది. తెలంగాణపై ఏకాభిప్రాయం కావాలన్న సాకుతో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయమనే అవకాశం ఉంది. అదే జరిగితే తెలంగాణ తీర్మానం వీగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తెలంగాణవాదులు, టీఆర్ఎస్ అంగీకరించదు. అమ్మ ముందు ఉన్న ఈ అయిదు ఆప్షన్లల్లో ఏదో ఒకటి మాత్రం ఈనెల 27న ప్రకటన చేస్తారని ఢిల్లీ నాయకులు అంటున్నారు. తెలంగాణ పై కొన్ని గంటల్లో ప్రకటన రాబోతుంది..ఆ ప్రకటన తరువాత రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి..
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more