అతడు రాజకీయ నాయకురాలు భర్త. ఆర్థికంగా ఉన్న వ్యక్తి. కానీ అతడు చేసేది మాత్రం దొంగతనం. అదేంటి అనుకుంటున్నారా ? ఈ స్టోరీ చదవండి. మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం బైరాపురం గ్రామానికి చెందిన రతలావత్ అమర్‌సింగ్ (48) అలియాస్ బిక్యాకు సొంత ఊరిలో 20 ఏకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయనకు ఊరిలోను, చంపాపేటలోని దుర్గభవానీనగర్‌లోను రెండతస్తుల భవనాలు ఉన్నాయి. వీటిపై అద్దెల రూపంగానే నెలకు రూ.20 వేల ఆదాయం వస్తుంటుంది. ఆయన భార్య విజయ వెల్దండ మండలం ఎంపీపీగా, బైరాపురం సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించారు.
బానే ఉన్నా అమర్‌సింగ్ మాత్రం చోరకళలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇతనిపై గతంలో సరూర్‌నగర్, కూకట్‌పల్లి, నల్గొండ పోలీస్‌స్టేషన్ల పరిధిలో సుమారు 8 కేసులు నమోదై ఉన్నాయి. ఈ నెల 21 రాత్రి కల్లు సేవించిన అమర్‌సింగ్.. గ్రీన్‌పార్క్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడ్డాడు. బీరువా తెరిచి ఒక కిలో వెండి వస్తువులు తస్కరించాడు. సమీపంలోని మరో ఇంట్లోకి చొరబడి బీరువాలోని 28.3 తులాల బంగారు నగలు, 1.7 కిలోల వెండి ఆభరణాలు దొంగిలించాడు.
సొత్తును ఇంట్లో ఉంచి మరుసటి రోజు స్వగ్రామానికి వెళ్లిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీంకు దొరికిన వేలిముద్రల ఆధారంగా పాత నేరస్థుడు అమర్‌సింగే ఈ దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించారు. అప్పటి నుంచి అతని కోసం మాటువేశారు. బుధవారం నగరానికి వచ్చిన అమర్‌సింగ్.. దొంగిలించిన సొత్తులో ఒక గొలుసును అమ్మడానికి చంపాపేటలో యత్నిస్తుండగా పట్టుకున్నారు. అనంతరం అతనిని విచారించి.. ఇంట్లో దాచిన పదిలక్షల విలువైన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. విశేషం ఏంటంటే... దొంతనం కేసులో జైలుకు వెళ్లి ఈ నెల 18న బెయిల్‌పై విడుదలైన ఆ ప్రబుద్ధుడు మూడురోజులకే మళ్లీ చోరీకి పాల్పడి దొరికిపోవడం.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more