YouTuber rams car to test iPhone 14 crash detection ఐ ఫోన్-14లోని క్రాష్ ఫీచర్ ఎలా పనిచేస్తుందీ.?

Youtuber s crash detection experiment with an iphone 14 goes viral

iPhone, durability, iPhone 14, iPhone 14 pro, iPhone 14 max, iPhone 14 comparison, samsung galaxy, iPhone 14 crash feature, iPhone 14 crash detection, iPhone feature, iPhone 14 crash feature experiment, iPhone 14 crash feature life, iPhone 14 crash feature hack, iPhone 14 crash feature crazy, apple iPhone 14 crash feature, iPhone 14 crash feature wreck, iPhone 14 hammer, iPhone 14 drop, iPhone 14 test, iPhone 14 crash feature 60 mph

The iPhone 14, which was launched recently, has a crash detection feature. Apple claimed, the feature is activated in the phone in case the vehicle you are travelling meets with an accident. It detects a crash and sends SOS messages to your contacts and calls emergency services automatically.

ITEMVIDOES: ఐ ఫోన్-14లోని క్రాష్ ఫీచర్ ఎలా పనిచేస్తుందీ.? ఇలా ప్రయోగం..

Posted: 09/24/2022 05:48 PM IST
Youtuber s crash detection experiment with an iphone 14 goes viral

సోషల్‌ మీడియా అంటూ వచ్చిన తరువాత.. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది అరచేతిలో వినబడటమే కాదు.. కనబడుతోంది కూడా.  ప్రపంచంలోని సమస్త సమాచారం స్మార్ట్ ఫోన్ తో మనకు అందుబాటులో ఉంటోంది. ఇది కాదనలేని సత్యం. దీంతో గతంలో దినపత్రికలలో, టీవీ ఛానళ్లలో పెద్దపెట్టున పబ్లిసిటీ ఇచ్చి.. ఆ తరువాత పలు సంస్థలు తమ ఉత్పత్తులను లాంచింగ్ డేట్ ను ప్రకటించేవి. కానీ ఈ దశాబ్ద కాలంలోనే పరిస్థితులు ఎంతగా మారిపోయాయంటే.. ఎక్కడా ఎందులో ఎలాంటి ప్రచారం చేయకపోయినా.. కేవలం నెట్టింట్లో సమాచారంతో ఎప్పుడు ఎం జరుగుతుందన్న విషయాలు సగటు మొబలై్ యూజర్లకు అందుబాటులోకి వస్తున్నాయి.

అదేవిధంగా సోషల్ మీడియాలో చాలా హైప్ క్రియేట్ చేసిన లాంచ్.. అఫిల్ ఐఫోన్ 14 అన్న విషయం తెలిసిందే. టెక్ ఔత్సాహికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐఫోన్ 14 మొబైల్ లాంచ్ అయిపోయింది. ఐఫోన్ 14లో ఏది బెటర్, దేనిలో ఏయే అప్షన్లు ఉన్నాయి. దేనిలో ఏయే ఫీచర్లు అదనంగా పోందుపర్చారు అన్న వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు మొబైల్ రివ్యూవర్లు. ఆపిల్ ఐఫోన్ అన్ జిప్పింగ్ ద బాక్స్ అంటూ ఇప్పటికే నెట్టింట్లో పలు రివ్యూలు వచ్చేశాయి. దీనిలో ఇచ్చిన కొన్ని ఫీచర్లు అందరికీ తెగ నచ్చేశాయి.

వాటిలో ముఖ్యమైనది క్రాష్ డిటెక్షన్ ఫీచర్. అంటే మనం కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగితే.. దీన్ని గుర్తించిన ఐఫోన్ వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందిస్తుంది. ఎవరి సహాయం లేకుండా.. సహకారం లేకుండా కేవలం మొబైల్ ఫోన్ దానంతట అదే క్రాష్ డిటెక్షన్ సెన్సార్ ఆధారంగా మీ కాంటాక్టులకు సమాచారం అందజేస్తుంది. ఇంతవరకు బాగనే ఉన్నా.. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? అన్న అనుమానం మాత్రం ఎవరికీ కలగదు. కానీ కొంత మంది యూట్యూబర్లకు ఇదే సంధేహం ఉత్పన్నమయ్యింది. దీంతో తమ అనుమానాన్ని నివృత్తి చేసుకునే పనిలో పడ్డాడు.

అందుకే ఒక 2005 మోడల్ మెర్క్యూరీ గ్రాండ్ మార్కయిస్ కారులో ఐఫోన్‌ను పెట్టి యాక్సిడెంట్ చేశాడు. రిమోట్ కంట్రోల్‌తో కారుకు యాక్సిడెంట్ చేసి, ఈ మొత్తాన్ని వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్టు చేశాడు. మొత్తం రెండుసార్లు ఇలా యాక్సిడెంట్ చేయగా.. రెండు సార్లూ ఐఫోన్ ఫీచర్ పనిచేసిందని, ఎమర్జెన్సీ సేవలకు కాల్ చేసిందని ఈ యూట్యూబర్ తేల్చాడు. అయితే కొంచెం లేట్ అయిందన్నాడు. ఇలా యాక్సిడెంట్ అవగానే పది సెకన్లపాటు ఐఫోన్‌లో టైమర్ వస్తుంది. ఈ టైమర్‌ను ఆపేస్తే యూజర్‌కు పెద్దగా ప్రమాదం లేనట్లు ఐఫోన్ భావిస్తుంది. ఒకవేళ యూజర్ తన మొబైల్‌లో టైమర్‌ ఆపలేకపోతే.. వెంటనే అత్యవసర విభాగానికి, అతని మొబైల్‌లోని కాంటాక్టులకు మెసేజిలు పంపుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles