Electronic equipment worth Rs 3 crore stolen కుషాయిగూడ బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలో చోరీ..

350 smart phones worth 70l stolen from bajaj electronics showroom

Bajaj Electronics, Bajaj Electronics Showroom, ECIL Square, CCTV cameras, showroom manager, 350 smart phones, Kushaiguda police station, ACP Sadhana Rashmi Perumal, dog squad, Rachakonda commissionerate, Telangana, Crime

A massive theft took place in Kushaiguda police station. Thieves stole appliances worth crores from Bajaj Electronics at ECIL Square. The thugs committed the theft by cutting the wires of the CCTV cameras. 350 cell phones and electronic items worth lakhs were stolen. Their value is estimated to be around 3 crores

బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలో చోరీ.. రూ.70 లక్షల ఫోన్లు గల్లంతు

Posted: 09/22/2022 04:07 PM IST
350 smart phones worth 70l stolen from bajaj electronics showroom

హైదరాబాద్‌లోని ప్రముఖ చెయిన్ ఎలక్ట్రానిక్ సంస్థకు చెందిన షోరూంకి కన్నమేసిన దొంగలు ఏకంగా కోటి రూపాయల మేర విలువైన వందలాది స్మార్టు ఫోన్లను ఎత్తుకెళ్లారు. అయితే ఇది పూర్తిగా తెలిసినవారి పనేనని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈసీఐఎల్ చౌరస్తాలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో దొంగలు ఈ షోరూమ్ లోకి చోరబడ్డారు. ఈ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ కు ఓ మూలన ఉన్న వెంటిలేటర్ ఇనుప చువ్వలు, ఫాల్స్ సీలింగ్ తొలగించి దొంగ లోపలికి చొరబడ్డాడు.

ఇక షోరూమ్ లోకి చొరబడిన దొంగ లోపలికి ప్రవేశించిన తర్వాత ముంగుజాగ్రత్త చర్యగా దుకాణంలోని సీసీ కెమెరాలను టార్గెట్ చేశాడు. సీసీ కెమెరాలు పనిచేయకుండా వాటి వైర్లను కట్ చేశాడు. అనంతరం షాపులోని కేవలం స్మార్ట్ ఫోన్లను విక్రయించే చోటుకు చేరుకున్నాడు. అందులో అత్యంత ఖరీదైన ఐఫోన్, వివో, ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్లను విక్రయించే కౌంటర్ వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి తాను ఎంచుకున్న300లకు పైగా ఖరీదైన ఐఫోన్, వివో, ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్లను తీసుకుని పరారయ్యాడు. కాగా, దుకాణంలోకి చొరబడిన దొంగ ఇతర కౌంటర్ల వద్దకు వెళ్లకపోవడం.. ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను ముట్టుకోకుండా వెళ్లకపోవడం గమనార్హం.

ఉదయం షోరూం తెరిచిన సిబ్బంది చోరీ విషయాన్ని గుర్తించారు. సంస్థ జనరల్ మేనేజర్ మహ్మద్ హబీబ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ బృందాలు షోరూంకు చేరుకుని ఆధారాలు సేకరించాయి. ఓ సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలను బట్టి చోరీకి పాల్పడింది ఒక్కడేనని పోలీసులు నిర్ధారించారు. అతడికి ఇంకెవరైనా సహకరించి ఉంటారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఇది తెలిసినవారి పనేనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నేరుగా సెల్‌ఫోన్లు ఉండే చోటు వద్దకు వెళ్లడం ఇందుకు ఊతమిస్తోంది. సెల్‌ఫోన్లు కొనేందుకు వచ్చి రెక్కీ నిర్వహించి పథకం ప్రకారమే చోరీ చేసినట్టు అనుమానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles