Kerala bride chooses potholed road for photoshoot దెబ్బతిన్న రోడ్లపై వధువు ఫోటోషూట్.. ప్రశంసించిన నెటిజన్లు.!

A wedding photoshoot like no other kerala bride poses on road full of potholes

bride photoshoot erala, kerala pathhole road photoshoot, wedding photoshoot kerala, Kerala Bride's Photoshoot Video, kerala bride viral video, bride walks along pothole, bride photoshoot goes viral with Pothole-riddled Road, potholes kerala road viral photoshoot, bridal photoshoot viral, potholes Kerala bride photoshoot video, bridal photoshoot, bride, photo shoot, social media, Kerala Bride, photoshoot, bridal photoshoot, kerala roads, kerala potholes, potholes road, bride shoot, viral video, wedding day, wedding photoshoot, Kerala

A bridal photoshoot holds a very important place in a bride's life. It requires a lot of planning, how to pose, how to look and most importantly where toshoot. Brides usually shoot at beautiful locations to get the best pictures for their big day. However, this Kerala bride did the opposite. Check out the images, where a bride from Kerala shot pictures for her wedding day on a road full of pot holes.

ITEMVIDEOS: దెబ్బతిన్న రోడ్లపై వధువు ఫోటోషూట్.. ప్రశంసించిన నెటిజన్లు.!

Posted: 09/21/2022 05:13 PM IST
A wedding photoshoot like no other kerala bride poses on road full of potholes

ప్రస్తుత జనరేషన్‌లో పెళ్లి అనగానే.. అందరికీ ఫొటో షూట్స్‌ గుర్తుకు వస్తాయి. కాబోయే వధువరులిద్దరూ ప్రకృతికి అలవాలమైన మంచి టూరిస్టు స్పాట్ లకు వెళ్లి.. లేదా పవిత్రమైన ఫుణ్యక్షేత్రాలు, హెరిటేజ్ ప్రాంతాలకు వెళ్లి తనవితీరా ఎంజాయ్‌ చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. ఇవి తమ జీవితంలో ఒకేసారి తీసుకునే ఫోటోలు కావడంతో వారు వీటికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఇక తమ పెళ్లినాటి ఫోటోలతో పాటు ఈ పెళ్లికి ముందు ఫోటో షూట్ చిత్రాలను కూడా భవిష్యత్తులో తమ పిల్లలకు, మనమలు, మనమరాళ్లకు చూయించాలని భద్రంగా దాచుకుంటారు.

ఇలా తమ చిరకాల జ్ఞాపకాలతో పథిలపర్చుకునే ఫోటోలకు మంచి ఫోటోగ్రాపర్ ను కూడా కేటాయించుకుంటారు. ఈ ఫోటో షూట్ కోసం సంపన్నులైతే ఏకంగా డిజైనర్లను, రకరకాల దుస్తులను కూడా తీసుకుని ఒక్క రోజును పూర్తిగా కేటాయిస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ఓ వధువు ఫొటో షూట్‌ విషయంలో వినూత్నంగా ఆలోచించింది. దీంతో, ఆమె చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజనులు అమె చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. కాగా అమె పోస్టు ఎంత వైరల్ అయ్యిందంటే.. ఏకంగా అమె రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.

కేరళకు చెందిన ఓ యువతి అందంగా పెళ్లికూతురుగా ముస్తాబై రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఫొటో షూట్ చేయించుకుంది. కానీ, రోడ్డుపై ఉన్న వారంతా ఆమెను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ యువతి మాత్రం తన ఫొటో షూట్‌.. రోడ్డుపై ఉన్న గుంతలను చూపిస్తూ తీసుకుంది. తమ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో..ప్రభుత్వానికి ఎత్తిచూపేందుకు అమె ఈ ప్రయత్నం చేసింది. ఈ రోడ్లపై వాహనదారుల ఇబ్బందులను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కాగా, వధువు ఫొటో షూట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ వధువును ప్రశంసిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles