Video Shows Cargo Ship Capesize at Turkish Port ఇస్కెండరమ్ పోర్టులో అందరూ చూస్తుండగా సీ-ఈగల్ ఓడ మునక

Video egyptian ship tips over in turkey port while attempting to unload cargo

sea eagle, turkey s transport ministry, ministry, turkey, sea eagle -mersin, iskenderum, ship sinking video, sea eagle capsizing, Iskenderun, port of Mersin, Turkey’s Ministry of Transport and Infrastructure, Sea Eagle, Turkey

The video below was filmed in Turkey’s Iskenderun Port and shows an incident involving the geared cargo ship Sea Eagle taking place this past Saturday. As you can the ship was using a port lift truck to unload containers when it suddenly keeled over to port.

ITEMVIDEOS: ఇస్కెండరమ్ పోర్టులో అందరూ చూస్తుండగా సీ-ఈగల్ ఓడ మునక

Posted: 09/20/2022 04:25 PM IST
Video egyptian ship tips over in turkey port while attempting to unload cargo

టర్కీలో సీ-పోర్టులో ఓ భారీ నౌక అందరూ చూస్తుండగా సముద్రంలో మునిగిపోయింది. అయితే అదృష్టవశాత్తు అందులో వచ్చిన అందరూ దిగిపోయిన తరువాత ఈ ప్రమాదం సంభవించింది. భారీ నౌక సముద్రంలో మునిగిపోతున్న తరుణంలో వచ్చిన శబ్దాలతో అందరూ భయకంపితులై దాని నుంచి దూరంగా పారిపోయారు. ఈ ఘటన టర్కీలోని ఇస్కెండరమ్ పోర్టులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై నెటిజనుల నుంచి మిశ్రమస్పందనలు వస్తున్నాయి.

టర్కీ అధికారుల వివరాల ప్రకారం తమ దేశంలోని ఇస్కెండరమ్ పోర్టుకు ఓ భారీ నౌక చేరుకుంది. ఈ నౌకలో కొందరు ప్రయాణికులతో పాటు పలు కంటైనర్లు కూడా ఉన్నాయి. ఇలా భారీ నౌక పోర్టులోని డాక్ యార్డు వద్దకు చేరుకుంది. వెంటనే నౌకలోని సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా దిగేసారు. ఇక నౌకలోని కంటైనర్లను భారీ క్రేన్ల సాయంతో ఒక్కొక్కటిగా అన్‌లోడ్ చేస్తున్నారు. ఇంతలో ఏమైందో విజిల్స్ వేసినట్లు శబ్దం వచ్చింది. పడవ పక్కనే ప్లాట్‌ఫాంపై నిలబడి ఉన్న వాళ్లందరూ ఆ శబ్దం విని అక్కడి నుంచి నౌక నుంచి దూరంగా పారిపోయారు. అసలేం జరుగుతుందోనని అందోళన చెందుతూ దూరంగా వెళ్లి చూస్తున్నారు.

వాళ్లు చూస్తుండగానే నెమ్మదిగా ఒక పక్కకు ఒరిగిన ఆ భారీ నౌక.. సముద్రంలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘సీ ఈగల్’ అనే పేరున్న ఈ నౌక.. టర్కీలోని ఇస్కెండరమ్ పోర్టుకు వచ్చింది. అక్కడ కంటైనర్లు అన్‌లోడ్ చేస్తున్న సమయంలో అదుపుతప్పి నీటమునిగింది. నౌకలో బ్యాలెన్స్‌కు బంధించిన సమస్య ఉందేమో అని కొందరు అనుమానిస్తున్నారు. అయితే పడవలోని సిబ్బంది మాత్రం.. దానిలోని అన్ని పరికరాలు చక్కగా పనిచేస్తున్నాయని, అంతకుముందు వరకూ నౌక బాగానే ఉందని చెప్తున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 24 కంటైనర్లు కనిపించకుండా పోయాయని అధికారులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles