"Anti-Hijab" Protests Intensify In Iran Over Woman's Death ఇరాన్‌లో మిన్నంటిన హిజాబ్ వ్య‌తిరేక నిర‌స‌న‌లు తీవ్ర‌త‌రం

Anti hijab revolution hits iran women chop hair burn hijabs in war against moral police

mahsa amini, morality police iran, iran girl killed, anti hijab protest in iran, masha amini, why death of 22-year-old mahsa amini has sparked protests in iran, hijab protest in iran, mahsa amini video, iran hijab death, hijab iran, hijab, iran women, iran president, iran protests, iran protest hijab, Iran Protests, Hijab protests, Anti-Hijab Protests, Hijab rules in Iran, Mahsa Amini, Public anger, morality police, Tehran, Iran, Crime

Fresh protests broke out in Iran over the death of a young woman who had been arrested by the "morality police" that enforces a strict dress code, local media reported. Public anger has grown since authorities on Friday announced the death of Mahsa Amini, 22, in a hospital after three days in a coma, following her arrest by Tehran's morality police during a visit to the capital on September 13.

ఇరాన్‌లో మహిళల నిర‌స‌న‌లు: జట్టు కత్తెరించుకుని.. హిజాబ్ లను కాల్చి..

Posted: 09/20/2022 03:33 PM IST
Anti hijab revolution hits iran women chop hair burn hijabs in war against moral police

ఇరాన్‌లో సోమ‌వారం నిర‌స‌న‌లు మ‌ళ్లీ వెల్లువెత్తాయి. డ్రెస్ కోడ్ విష‌యంలో పోలీసులు అరెస్టు చేసిన మ‌హిళ మృతిచెంద‌డంతో ఆందోళ‌న‌లు మిన్నంటాయి. ఇరాన్‌లో ఇటీవ‌ల హిజాబ్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం రోజున 22 ఏళ్ల మ‌హ‌సా అమిని మృతిచెందిన‌ట్లు ప్ర‌క‌టించిన త‌ర్వాత ఆ దేశంలో హిజాబ్ వ్య‌తిరేక ఆందోళ‌న‌లు తీవ్ర‌త‌రం అయ్యాయి. టెహ్రాన్‌, మాషాద్ న‌గ‌రాల్లోని వ‌ర్సిటీల్లో నిర‌స‌న‌లు హోరెత్తాయి. హిజాబ్ వ్య‌తిరేక ప్ర‌ద‌ర్శ‌న స‌మ‌యంలో సోమ‌వారం రోజున ఓ మ‌హిళ త‌న హిజాబ్‌ను గాలిలోకి విసిరి వేసింది. భ‌ద్ర‌తా ద‌ళాల ముందే ఆమె ఆ ప‌ని చేసింది.

త‌న‌ను అరెస్టు చేయాలంటూ స‌వాల్ కూడా విసిరింది. ఆ స‌మ‌యంలో అక్క‌డ ఉన్న పురుషులు ఆమెకు చీర్స్‌ కొట్టారు. మ‌హ‌సా అమిని అనే యువ‌తి హిజాబ్ ధ‌రించ‌లేద‌ని కొన్ని రోజుల క్రితం పోలీసులు ఆమెను కొట్టారు. అయితే ఆమె మ‌ర‌ణించ‌డం వ‌ల్ల ఇరాన్‌లో నిర‌స‌న‌లు మ‌ళ్లీ ఊపందుకున్నాయి. మ‌రోవైపు అమిని మృతి ప‌ట్ల ఇరాన్‌లో భిన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. హిజాబ్ గురించి పోలీసులు విచారిస్తున్న స‌మ‌యంలో.. పోలీస్ స్టేష‌న్‌లోనే అమిని కుప్ప‌కూలినట్లు ఓ వీడియో ద్వారా వెల్ల‌డైంది. కానీ ఇరాన్ పోలీసులు మాత్రం అమినికి గుండెపోటు వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. అయితే ఆ రోజు వ‌ర‌కు అమిని ఆరోగ్యం బాగానే ఉంద‌ని ఆమె త‌ల్లితండ్రులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles