Punjab Youth Shot Dead Inside Grocery Store in Georgia అమెరికాలో భారత యువకుడిని కాల్చిచంపిన ఆప్రికన్..

Punjab youth shot dead inside grocery store in georgia horrific video emerges

Indian Shot Dead in US, Paramveer Singh, Hardyal Singh, Grocery Store, Georgia, Punjab youth, Dhapai village, Kapurthala Youth, African national, Chris Copeland, caught on cam, US, America, Crime

An Indian-origin man running a grocery store has been shot dead during a daylight robbery in Georgia, US. The deceased has been identified as Paramvir Singh, a resident of Dhapai village in Kapurthala district. The incident was also caught on camera. In the 1.30-minute video clip, Singh can be seen sitting inside the store when the accused, an African national entered the grocery store.

ITEMVIDEOS: అమెరికాలో భారత యువకుడిని కాల్చిచంపిన ఆప్రికన్..

Posted: 09/15/2022 06:23 PM IST
Punjab youth shot dead inside grocery store in georgia horrific video emerges

అమెరికాలో దారుణం జరిగింది. ఉన్నత విద్యతో పాటు ఏదో ఒక పని చేసుకుని అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడాలని కలలుకనే భారతీయుల సంఖ్య చాలా అధికం. ఈ క్రమంలో అనేక మంది అమెరికాలోని పలు రాష్ట్రాలలో స్థిరపడుతున్నారు. ఎలాంటి పనులైనా చేసి.. తమ విద్యను పూర్తి చేసుకున్న తరువాత హుందాగా అక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకోవాలని ప్రపంచంలోని అనేక మందిలానే భారతీయ యువకులు కూడా ప్రయత్నాలు చేస్తూ.. తమ జీవనాన్ని కోనసాగిస్తున్నారు. అయితే వీరి ఎదుగుదలను జీర్ణం చేసుకోలని పలు దేశాల యువకులు జార్జియాలోని కిరాణా షాపులో పనిచేస్తున్న భారతీయ యువకుడిని ఓ దుండగుడు కాల్చిచంపాడు.

షాపులోకి మాస్క్ ధరించి వచ్చిన దుండగుడు భారతీయ యువకుడిని తుపాకీతో బెదిరించి.. డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అందుకు సమ్మతించిన భారతీయ యువకుడు పెద్ద కరన్సీ నోట్లను పక్కనబెట్టి చిన్నవాటిని ఇచ్చేశాడు. అయినా నమ్మని ఆగంతకుడు షాపు కౌంటర్ లోనికి వస్తుండగా, పెద్ద కరన్సీ నోట్లను కూడా ఇచ్చేశాడు. అయితే నోట్ల కోసం వెతికిన ఆగంతకుడు డబ్బులు లేవని గ్రహించి.. భారతీయ యువకుడిపై తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. అమెరికాలోని జార్జియాలో ఈ సంఘటన జరిగింది.

అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోని పరిశీలించగా, అప్పటికే తీవ్ర రక్తస్రావం జరిగి భారతీయ యువకుడు మరణించాడని పోలీసులు తెలిపారు. పంజాబ్‌ రాష్ట్రంలోని కపుర్తలా జిల్లా ధాపై గ్రామానికి చెందిన పరమ్‌వీర్ సింగ్ గా భారతీయ యువకుడిని గుర్తించారు. ఇతను జార్జియాలో గ్రోసరీ షాపు నిర్వహిస్తున్నాడు. కాగా, అతనిపై కాల్పులు జరిపింది ఆఫ్రికా జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టపగలు తుపాకీతో షాప్‌లోకి ప్రవేశించి.. పర‌మ్‌వీర్‌ సింగ్‌ను బెదిరించి డబ్బులు దోపిడీ చేశాడు. అనంతరం అతడిపై తుపాకీతో కాల్పులు జరిపాడు.

షాపులో ఉన్న సిసిటీవీల్లో తాను నిక్షిప్తమయ్యానని తెలిసి.. కంప్యూటర్‌ పరికరాలను కూడా ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటనపై స్పందించిన అమెరికా పోలీసులు 26 ఏళ్ల నిందితుడు క్రిస్ కోప్లాండ్‌ను అరెస్ట్‌ చేశారు. మరోవైపు పరమ్‌వీర్‌ సింగ్‌ మృతదేహం పంజాబ్‌లోని సొంత గ్రామమైన ధాపై చేరుకుంది. దీంతో అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఒక్కడే కుమారుడైన పరమ్‌వీర్‌ సింగ్‌ మరణాన్ని వారు తట్టుకోలేపోతున్నారు. మరోవైపు ఆ గ్రోసరీ షాపులోని సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటనకు చెందిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles