Former MP Dr Sasikala Ramaswamy Molested In Public మాజీ ఎంపీపై బహిరంగ వేధింపులు.. వీడియోకు చిక్కిన బీజేపి నేత

Former mp dr sasikala ramaswamy molested at a public place

Dr Sasikala Pushpa Ramaswamy, former MP, sasikala pushpa thoothukudi molest, molest on former MP, molest on former AIADMK MP, molest on Tamil Nadu BJP Leader, Annamalai, Emmanuel Sekaran, violate woman, former Member Of Parliament, creepster, former thoothukudi MP, AIADMK, Tamil Nadu, Politics

In the video, it can be seen that that man was grabbing Dr Sasikala Pushpa Ramaswamy’s saree and was trying to hold her hand. She immediately sensed his intentions and snatched her saree pallu back. That audacious man, even then, was trying to grab her hand. Further ahead, when she was receiving a bouquet, the man again tried to hold her hand and it was very clear that he was constantly trying to touch Dr Ramaswamy.

ITEMVIDEOS: మాజీ ఎంపీపై బహిరంగ వేధింపులు.. వీడియోకు చిక్కిన బీజేపి నేత

Posted: 09/15/2022 05:25 PM IST
Former mp dr sasikala ramaswamy molested at a public place

బీజేపీ నేత, మాజీ పార్లమెంటు సభ్యురాలు శ‌శిక‌ళా పుష్ప‌ను ఓ కార్య‌క్ర‌మంలో ఆ కాషాయ పార్టీకి చెందిన రాష్ట్రస్థాయి నేత లైంగిక వేధింపుల‌కు గురిచేసిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా నేత వేదికపై ఉన్నా.. అమెతో ఎలా వ్యవహరించాలో కూడా తెలియని స్థితిలో అమర్యాదగా వ్యవహరించారు. అమరవీరుడు ఇమ్మాన్యుయేల్ శేఖరన్ 65వ వర్థంతిని తమిళనాడులో ఈనెల 11న నిర్వహించగా, అదేరోజును ఈ ఘటన జరగినా ఆలస్యంగా వెలుగు చేసింది. తమిళానాడులోని రమనాథపురం జిల్లా పరమక్కుడిలోని ఆయన స్మారక స్థూపం సాక్షిగా ఓ మహిళా నేతపై జరిగిన లైంగిక దాడి తాజాగా వెలుగుచూసింది.

డీఎంకే ఐటీ విభాగం రాష్ట్ర డిప్యూటీ కార్య‌ద‌ర్శి ఇసై ద‌క్షిణామూర్తి ఈ వీడియోను త‌న సోష‌ల్ మీడియా వేదిక‌పై షేర్ చేయ‌డంతో నెట్టింట్లో వైరల్ గా మారింది. అమరవీరుడు ఇమ్మాన్యుయేల్ శేఖరన్ వర్థంతిని పురస్కరించుకుని అన్ని ప్రధాన పార్టీల నేతలు ఆయనకు ఘనంగా అంజలి ఘటించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడకు వచ్చిన బీజేపి నేతలు కూడా శ్రద్దాంజలి ఘటించారు. కాగా ఈ సందర్భంలో జనం ఎదుట, అమరవీరుడి స్థూపం సాక్షిగా మాజీ మహిళా ఎంపీకి జరిగిన పరాభవం వీడియో బయటపడింది.

ఈ వీడియోలో బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పొన్ బాల‌గ‌ణ‌ప‌తి శ‌శిక‌ళ పుష్ప చీర‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా ఆమె తోసివేసినట్టు క‌నిపించింది. అప్పటికీ మిన్నకుండని ఆపై పొన్ బాల‌గ‌ణ‌ప‌తి ఆమె ఎడ‌మ చేతిని తాకేందుకు ప్ర‌య‌త్నించాడు. అమెపై తాకాలన్న ఉద్దేశ్యం ఉన్నట్లు ఈ వీడియోలో కనిపించింది. బీజేపీలో చేరిన మ‌హిళ‌లు ఆ పార్టీ నేత‌ల నుంచి త‌మ‌ను తాము కాపాడుకోవడానికి పెద్ద పోరాట‌మే చేయాల్సి వ‌స్తోందా అనే క్యాప్ష‌న్‌తో డీఎంకే నేత ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోపై పొన్ బాల‌గ‌ణ‌ప‌తి ఇంత‌వ‌ర‌కూ స్పందించ‌లేదు. కాగా జనంతో రద్దీ అధికంగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు సహజమంటూ పలువురు సమర్థించడం గర్హనీయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles