PM Modi announces Rs 2 lakh ex-gratia for victims సికింద్రాబాద్ బ్యాటరీ పేలుడు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. పరిహారం

Pm modi announces rs 2 lakh ex gratia for secunderabad hotel fire accident victims

Prime Minister Narendra Modi, PM Modi Condolence, Victim families, PM Modi ex-gratia, deceased families, rs 2 lakh to deceased familes, rs 50,000 injured, secundrabad fire accident, ruby hotel fire accident, Electric bikes battery blast, Secundrabad, Telangana, Crime

Prime Minister Narendra Modi extended his condolences to the families who lost their beloved ones in the fire mishap that took place in Secunderabad. PM Modi announced Rs 2 lakh from PMNRF to the families of the deceased and Rs 50,000 for those who were injured.

సికింద్రాబాద్ బ్యాటరీ పేలుడు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

Posted: 09/13/2022 01:02 PM IST
Pm modi announces rs 2 lakh ex gratia for secunderabad hotel fire accident victims

సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జ్ లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ లాడ్జీ కింద సెల్లార్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో ఈ బైకులు పేలి అగ్ని ప్రమాదం సంభవించడం.. బ్యాటరీల నుంచి విడుదలైన పోగ కమ్ముకుని లాడ్జీలోని మొదటి, రెండవ అంతస్థులలో ఉన్నవారు ఊపిరాడక చనిపోయిన విషయం తెలిసిందే. విపరీతంగా పొగ కమ్ముకోవడంతో దాని బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన కొందరు మొదటి, రెండవ అంతస్థుల నుంచి కిందకు దూకాగా, వారు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు వారిని స్థానిక అసుపత్రులలో చికిత్స నిమిత్తం తరలించారు.

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణలోని సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో పలువురు చనిపోవడం తనకు ఎనలేని బాధను కలిగిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షంచారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ఆయన రెండు లక్షల పరిహారం అందిస్తామని.. గాయపడిన వారికి రూ.50 వేలు చెల్లిస్తామని ట్వీట్ లో పేర్కోన్నారు. కాగా ఈ ఘటనలో గాయపడినవారిలో పలువురి పరిస్థితి అందోళనకరంగా ఉంది.

రాష్ట్రప్రభుత్వం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపింది. బాధితులను కార్పోరేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందజేస్తున్నామని తెలిపింది. ఘటనలో మరణించినవారి కుటుంబాలకు రూ.3లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారాన్ని ప్రకటించింది. కాగా అగ్నిప్రమాద ఘటన విషయం తెలియగానే మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే సాయన్న చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇవాళ ఉదయం హోంమంత్రి మహమూద్ అలీ మరోసారి ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles