Two Hizbul militants killed in J&K encounter జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదుల హతం

Two hizbul militants killed 30 kg ied defused in kashmir police

jammu and kashmir, jammu and kashmir police, militant attack, militant killed, hizbul militants, anantnag encounter, Breaking News, kashmir police, terrorist, terroris, msouth kashmir pahalgam, Vijay Kumar, Pakistan funded outfit, Hijbul Mujahiddin, kashmir, Crime

Two Hizbul Mujahideen militants were killed in an encounter with security forces, police said. According to ADGP, Kashmir Zone, Vijay Kumar, the two militants were involved in the killing of Territorial Army personnel Saleem last year. “Killed terrorists identified as Danish Bhat @ Kokab Duree & Basharat Nabi, both affiliated with proscribed terror outfit HM. Both were involved in killing of two civilians on 29 May 2021 in Jablipora (Bijbehara),” Kumar tweeted.

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల హతం

Posted: 09/07/2022 11:31 AM IST
Two hizbul militants killed 30 kg ied defused in kashmir police

జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు-ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ సెక్టార్ లో పాకి్స్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న పక్కా సమాచారంతో కూంబింగ్ చేసిన పోలీసులు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులపై ముష్కరులు కాల్పులతో వవిరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు వెనువెంటనే తేరుకుని ప్రతికాల్పులు జరపడంతో ముష్కరులు ప్రాణాలు వదిలారు. ఈ ఘటన అనంతనాగ్ ప్రాంతంలోని పోష్క్‌రీరి గ్రామపరిధిలో జరిగింది.

పోష్కరిరీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. ఎలాగైనా వారిని ప్రాణాలతో అదుపులోకి తీసుకోవాలని భావించి కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో భారత భద్రతా బలగాలకు తారసపడిన ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. కాల్పులు ఆగిన అనంతరం ఆ ప్రాంతాన్ని పరిశీలించగా ఇద్దరు ఉగ్రవాదులు హతమై కనిపించారు. వారిని హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన డానిష్ భట్ అలియాస్ కొకబ్ దూరీ, బషరత్ నబీగా గుర్తించారు.

వీరిద్దరూ గతంలో పౌరహత్యలకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 2021లో సలీమ్ అనే భారత సైనికుడి హత్యతోపాటు ఆ తర్వాతి నెలలో జబ్లీపురాలో ఇద్దరు పౌరుల హత్య కేసులో వీరి ప్రమేయం ఉన్నట్టు కాశ్మీర్ జోన్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారని.. ఎక్కడైన ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా.? అన్న కోణంలో కార్డన్ సర్చ్ జరిగిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, శ్రీనగర్‌లోని ఖాన్‌మోహ్ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 35 కిలోల పేలుడు పదార్థాలు లభించాయి. అనంతరం వాటిని పేలకుండా చేసి ధ్వంసం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles