Doctor saved patient's life who collapsed after heart attack రోగికి ఆకస్మిక గుండెపోటు.. సీపీఆర్ తో కాపాడిన డాక్టర్

Viral video kolhapur cardiologist saves life with cpr patient collapses after heart attack

Cardiologist, massive appreciation, Arjun Adnaik, saving the life of a patient, sudden cardiac arrest, viral CCTV footage, twitter, doctor saving patient, cardiac arrest, sudden cardiac arrest, cctv footage, Rajya Sabha MP Dhananjay Mahadik, CPR video, viral video, twitter trending, doctor save patient, twitter viral video, Kolhapur, Maharashtra, social media, viral video, video viral, trending video

In a viral video, a Cardiologist from Maharashtra's Kolhapur has gained massive appreciation on social media, where he could be seen saving the life of a patient who suffered from a sudden cardiac arrest. The video shows a patient, who usually is sitting at first, feeling uneasy, following which he taps on the doctor's table, and the doctor then rushes to save the man. The viral CCTV footage was shared by Rajya Sabha MP Dhananjay Mahadik, who is a native of Kolhapur.

ITEMVIDEOS: వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి.. ఆకస్మిక గుండెపోటు.. సీపీఆర్ తో కాపాడిన డాక్టర్

Posted: 09/07/2022 12:45 PM IST
Viral video kolhapur cardiologist saves life with cpr patient collapses after heart attack

వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన రోగి ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యాడు. తాను కూర్చున్న కుర్చీలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అయితే అతిని అదృష్టం బాగుంది. ఆయన ఎదురుగా కూర్చుంది వైద్యనారాయణుడు. ఔనా వైద్యో నారాయణో హరి అన్నట్లుగానే ఆయన ఎదురుగా కూర్చున్న వైద్యుడు.. నారాయణుడిగా మారి నెమ్మదిగా సీపీఆర్ చేస్తూ క్షణ కాలంలోనే వాల్చిన ప్రాణాలను మళ్లీ పునరుజ్జీవం సోసుకునేలా చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో జరిగింది. కొల్హాపూర్‌లోని ప్రముఖ కార్డియాలజిస్ట్ అర్జున్ అద్నాయక్ ఆసుపత్రిలోనే ఈ ఘటన సంభవించింది.

కార్డియాలజీ స్పెషలిస్ట్ అయిన అర్జున్ అద్నాయక్ వద్దకు హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి జనరల్ చెకప్ కోసం అప్పడప్పుడూ వస్తుండేవాడు. పుష్కరకాలం క్రితం అమర్చిన పేస్‌మేకర్‌ను మార్చుకోవాలనే ఉద్దేశంతో రెండు రోజుల క్రితం మరోమారు ఆయన డాక్టర్ అర్జున్‌ను కలిశారు. వైద్యుడు మరో రోగిని చూస్తుండడంతో కేబిన్‌లోని ఆయన ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నారు. ఈ క్రమంలో కొంత అసౌకర్యంగా కదిలిన ఆయన మరుక్షణంలోనే తల వెనక్కి వాల్చేశాడు. అది చూసిన డాక్టర్ అర్జున్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆయన వద్దకు వెళ్లి సీపీఆర్ చేశారు. గుండెపై నిదానంగా తట్టారు. దీంతో రోగిలో మళ్లీ చలనం వచ్చి మామూలు స్థితికి చేరుకున్నాడు.

వైద్యుడి కేబిన్‌లో అమర్చిన సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. సోషల్ మీడియాకెక్కిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు డాక్టర్ అర్జున్ అద్నాయక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. క్షణాల్లో ఆయన స్పందించి సీపీఆర్ చేసి రోగికి పునర్జన్మ ప్రసాదించారని కొనియాడుతున్నారు. రాజ్యసభ సభ్యుడు ధనంజయ్ మహాదిక్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. డాక్టర్ అర్జున్ కొల్హాపూర్‌లోనే గొప్ప వైద్యుడని కొనియాడారు. రియల్ లైఫ్ హీరోలు మన మధ్యనే నివసిస్తారని చెప్పేందుకు ఇదో ఉదాహరణ అని అన్నారు. ఇలాంటి గౌరవనీయులు, మంచి వ్యక్తులకు అభినందనలని రాసుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles