Justice UU Lalit takes oath as 49th CJI సీజేఐగా జస్టిస్‌ యూయూ లలిత్‌ ప్రమాణ స్వీకారం

Justice uday umesh lalit sworn in as 49th chief justice of india

justice uu lalit sworn in as cji, new cji uu lalit, justice uu lalit swearing in, latest news supreme court, nv ramana retires, new chief justice of india sworn in, justice uday umesh lalit, justice uu lalit, sworn in, cji, president droupadi murmu, rashtrapati bhavan durbar hall, supreme court, justice nv ramana, retirement, legal news

Justice U U Lalit took oath as the 49th Chief Justice of India (CJI) on Saturday. President Droupadi Murmu administered the oath of office to Justice Lalit at the swearing-in ceremony held in the Durbar Hall of Rashtrapati Bhavan. The new CJI has a short tenure and will hold office till November 8, 2022. He succeeds Chief Justice N V Ramana who retired Friday.

ITEMVIDEOS: భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ యూయూ లలిత్‌ ప్రమాణ స్వీకారం

Posted: 08/27/2022 02:41 PM IST
Justice uday umesh lalit sworn in as 49th chief justice of india

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. క్రితం రోజు వరకు ఈ పదవిలో కొనసాగిన జస్టిస్ ఎన్వీ రమణ నుంచి 49వ సీజేఐగా యుయు లలిత్ బాధ్యతలను అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. జస్టిల్‌ లలిత్‌తో ప్రమాణం చేయించారు. ఈ ఏడాది నవంబర్‌ 8 వరకు ఆయన సీజేఐగా కొనసాగనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్కర్‌, కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, జస్టిస్‌ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.

జస్టిస్ యూయూ లలిత్ 1957 నవంబరు 9న జన్మించారు. 1983 జూన్‌లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 1985 డిసెంబర్‌ వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. 1986 నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నారు. అయన తన న్యాయవాది వృత్తిలో అధికంగా పేదలు, ప్రజావసరాలకు సంబంధించిన కేసులను వాదించి వారికి న్యాయాన్ని దక్కేలా చేశారు. 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. త్రిపుల్‌ తలాక్‌ సహా, అనేక కీలక కేసుల తీర్పుల్లోనూ జస్టిస్ లలిత్ భాగస్వామిగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles