జాంబిరెడ్డి సినిమా చూశారా? అందులో జాంబీలు ఎలా ప్రవర్తిస్తారో తెలుసు కదా? అచ్చం అలాంటివే జంతురాజ్యంలో కూడా ఉన్నాయి. అందుకీ వీడియోనే సాక్ష్యం. అయితే ఇక్కడ జాంబిలను మరో జాంబీలు మార్చడం కాదు.. అంతకన్నా ప్రమాదకరమైన మరోకటి కీటకాలను జాంబిలుగా మార్చేస్తున్నాయి. ఇక్కడ మీకు మరో విషయాన్ని కూడా గుర్తుచేయాలని భావిస్తున్నాం. బోజనం చేసే ముందు.. లేదా బయటకు వెళ్లి వచ్చిన తరువాత కాళ్లు చేతులు కడుక్కోవాలని పెద్దలు పలుమారు అదే పనిగా ఎందుకు చెబుతారో విషయాన్ని కూడా ఈ వీడియో తెలియజేస్తోంది.
మాసిమో అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో ఓ కీటకం గగుర్పాటు కలిగిస్తున్నది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. లక్షలాది మంది నెటిజనులు ఇప్పటికే ఈ వీడియోను వీక్షించారు. అంతగా ఆకర్షించేందుకు ఈ వీడీయోలో ఏముందీ.? అంటే.. జాంబి పురుగు. అదేంటీ అంటారా.. తన దేహాన్ని దాదాపుగా కోల్పోయింది.. కానీ ప్రాణాలతోనే ఉంది. అలాగనీ ఈ కీటకం చనిపోలేదు.. అయితే కేవలం ప్రాణాలతో మాత్రమే ఉంది అని చెప్పాలి. దాని పైభాగం మొత్తం కోల్పోయినా అది గడ్డిలో నడుచుకుంటూ వెళ్తున్నది. అంటే దాన్ని చంపేసి దాని శరీరాన్ని జాంబీలా మార్చేసింది పరాన్నజీవులైన ఫంగస్.
కీటకం దేహాన్ని పూర్తిగా ఆక్రమించేశాయి. దాన్ని వాహకంలా వాడుకుంటూ ఇతర కీటకాలపైకి దాడి చేసేందుకు సన్నధం అవుతున్నాయి. ఈ ఫంగస్లను మాసోస్పోరా అని పిలుస్తారు. పుట్టగొడుగుల్లో కనిపించే రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి ప్రాణాంతక పరాన్నజీవులు. కీటకాలను అవి చంపేసి జాంబీలుగా మార్చేస్తాయి. వాటి బీజాంశాలను వ్యాప్తి చేసేందుకు, మనుగడ కోసం మరిన్ని కీటకాలకు సోకేందుకు వింతగా ప్రవర్తించేలా చేస్తాయి. ఇక అందుకనే బయటకు వెళ్లిరాగానే, ఆడుకుని ఇంట్లోకి రాగానే. లేదా బోజం చేసే ముందు సబ్బుతో చక్కగా కాళ్లు చేతులు కడుక్కోవాలని పెద్దలు చెబుతారు. ఇవి కంటికి కనిపించని శ్రతువులు కదా.. అందకనే అప్రమత్తత అవసరం. కాగా ఈ వీడియోకోటి మందికి పైగా వీక్షించడం గమనార్హం.
A zombie bug.
While it's not alive, it's not even dead. A large number of mind controlling fungi leads insects to assume the strangest behaviors in order to spread their spores and infect more insects to survive.
[read more: https://t.co/jGMPpf08cP]pic.twitter.com/KWTIuIT20U
— Massimo (@Rainmaker1973) August 21, 2022
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more