Minor girl shot at by jilted lover in Patna ప్రేమ‌ను తిర‌స్క‌రించింద‌ని మైనర్ బాలిక‌పై ప్రేమోన్మాది కాల్పులు

Bihar class 9 girl shot in the neck allegedly by jilted lover in patna

Minor Girl, Broad daylight, Shocking incident, boy shoots girl, jilted lover shoots girl, jilted lover shoots minor girl, Jilted lover shoots 9th class girl, Patna, shooting, CCTV footage, patna, jilted lover, indirapuri locality, BIhar, crime

In a shocking incident, a 16-year-old girl was shot in the neck in broad daylight in Patna near a busy road on Wednesday. The bone-chilling incident has been caught on CCTV, showing a boy shooting a girl and fleeing from the spot after the girl collapsed on the ground. Patna police has, however, identified the accused but he is still at large.

ప్రేమ‌ను తిర‌స్క‌రించింద‌ని మైనర్ బాలిక‌పై ప్రేమోన్మాది కాల్పులు

Posted: 08/18/2022 03:48 PM IST
Bihar class 9 girl shot in the neck allegedly by jilted lover in patna

త‌న ప్రేమ‌ను తిర‌స్క‌రించింద‌నే కోపంతో ఓ ప్రేమోన్మాది ..మైనర్ బాలిక‌పై కాల్పులకు తెగబడ్డాడు. వెనుక నుంచి అకస్మాత్తుగా జరిపిన కాల్పులతో ఆ యువతి అక్కడికక్కడే కుప్పకూలింది. ఘటన అనంతరం అక్కడి నుంచి ప్రేమోన్మాది యదేశ్చగా పరారయ్యాడు. రక్తపు మడుగులో పడివున్న బాలికను గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించి.. బాలికను హుటాహుటిన అసుపత్రికి తరలించారు. మెడపై తూటా దిగటంతో ఆ బాధితురాలు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ దుశ్చర్య బీహార్ రాజధాని పాట్నాలో జరిగింది.

బాలికపై తుపాకీతో కాల్పులు జ‌రుపిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ వీడియోను స్థానికులు, నెటిజనులు విపరీతంగా షేర్ చేసుకోవడంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. బ్యూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రపురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించే కుటంబానికి చెందిన 15ఏళ్ల బాలిక.. తల్లితండ్రులతో కలసి నివసిస్తోంది. బాలిక చదువులో బాగానే రాణిస్తుండటంతో అమెకు తమలా కష్టాలు ఉండరాదని అమెను చదివిస్తున్నారు.

తొమ్మిదవ తరగతి చదువుతున్న ఆ బాలికను అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రేమ పేరుతో రోజు వేధింపులకు గురిచేస్తున్నాడు. అయినా అవేమీ పట్టించుకోకుండా.. తేలిగ్గా తీసుకున్న ఆ బాలిక, గురువారం కూడా యధావిధంగా ఉదయం పాఠశాలకని ఇంట్లోంచి బయలుదేరి వెళ్లింది. అయితే గత కొంతకాలంగా ఇలా వెంటబడుతున్న ఆ వ్యక్తికి తన మానన తనను వదిలేయాలని ఇటీవలే ఆ బాలిక కోరింది. తాను చదువుకుంటున్నానని, తనకు ఇలాంటి వ్యవహారాలపై ఏమాత్రం ఇష్టం లేదని బాలిక తేల్చిచెప్పింది. దీంతొ కొన్ని రోజులు కనబడని యువకుడు.. మళ్లీ ఆ బాలిక వెంటపడుతూ వేధించడం ప్రారంభించాడు.

దీంతో బాలిక కోపంతో ఈ వయస్సులో ప్రేమ ఏంటీ.? అని కోపంగా వెళ్లిపోయింది. ఆ తరువాత యువకుడు కనిపించినా పెద్దగా పట్టించుకోకుండా పాఠశాలకు వెళ్లిపోయింది. అయితే ఈ విషయాన్ని పెద్దది చేయడం ఇష్టంలేక.. తన తల్లిదండ్రులకు బాలిక విషయాన్ని చెప్పలేదు. అయితే తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో రగిలిపోయిన ప్రేమోన్మాది అమెను అంతం చేయాలని చూశాడు. తుపాకీని తన జేబులో పెట్టుకుని అమెకోసం అదే మార్గంలో కాపుకాసిన యువకుడు.. అమె రాగానే.. మాట్లాడే ప్రయత్నం చేశాడు.

అయితే బాలిక అతడితో మాట్లాడకుండా వెళ్తుండగా.. వెనకనుంచి అమెపై కాల్పులు జరిపాడు. మెడ బాగంలో తూటా దిగడంతో బాలిక అక్కడికక్కడే కుప్పకూలింది. ఆ తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రేమోన్మాదికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతున్న వివరాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. పరారీలో ఉన్న యువకుడి కోసం గాలిస్తున్నారు. నాటు తుపాకులు తయారు చేసేవారిపై పోలీసులు గురిపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles