RLD chief Jayant Chaudhary takes dig at CJI over 'Revri' culture మీ ఉచితాల లెక్కచెప్పండీ: సీజేఐకి ఆర్ఎల్డీ అధినేత ప్రశ్న

Rewadi war what freebies does cji get asks rld chief jayant chaudhary

jayant chaudhary, kapil sibal, supreme court, freebies debate, nv ramana, election freebies, supreme court on freebies,Freebies Issue,freebies in election, aap freebies,supreme court news today,freebies serious issue says sc,SC hearing on election freebies,Freebie Culture, sc rewadi war, rewadi war aap bjp, pm modi rewadi culture, kejriwal freebies, aap bjp rewadi war, revdi war, revdi culture, rewadi war, rld chief jayant chaudhary, cji nv ramana, electoral freebies supreme court, supreme court on freebies, jayant chaudhary, centre vs aap freebies, electoral freebies sc, political parties, National politics

After senior lawyer and Rajya Sabha MP Kapil Sibal’s recent remarks that he has no hope or expectations left from the Supreme Court triggered a massive controversy, Rashtriya Lok Dal national president Jayant Chaudhary on Friday said that there was some truth to what the former Congress leader stated. Chaudhary said not just him but the public also feels what Sibal said is correct. Calling for judicial reforms, the RLD president said there was a need for courts to contemplate what the veteran politician said recently.

మీరు పొందుతున్న ఉచితాల లెక్కచెప్పండీ: సీజేఐ ఎన్వీ రమణకు ఆర్ఎల్డీ అధినేత ప్రశ్న

Posted: 08/12/2022 09:39 PM IST
Rewadi war what freebies does cji get asks rld chief jayant chaudhary

ఉచిత తాయిలాలు వద్దన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి విమర్శలు గుప్పించారు. ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను పొందుతున్న ఉచితాలేంటో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఉచితాల పంపిణీ, వాగ్దానాలను సుప్రీంకోర్టు తీవ్రమైన సమస్యగా పేర్కొన్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఉచితాల కారణంగా ఆర్థిక వ్యవస్థ నష్టపోతోందని, అదే విధంగా ప్రజల సంక్షేమం సమతుల్యంగా ఉండాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

అయితే, కోర్టు వ్యాఖ్యలు చాలా సాహసోపేతంగా కనిపిస్తున్నాయని, సరైన స్ఫూర్తితో లేవని జయంత్ చౌదరి అన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో తమకు న్యాయం దక్కుతుందని ఎదురుచూసిన వారు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని సీనియర్ రాజకీయ నేత కపిల్ సిబాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలలో నిజముందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాల్లో కేసులు సంఖ్య నానాటికీ పెరుగుతుంటే.. కేవలం రాజకీయాలతో ముడిపడిన అంశాలపై సుప్రీంకోర్టు త్వరగా స్పందిస్తోందని కపిల్ సిబాల్ చేసిన అరోపణల్లో
నిజం లేకపోలేదని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో న్యాయశాస్త్ర ప్రక్షాళన కూడా జరగాల్సిన అవసరముందన్న కపిల్ సిబాల్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని అన్నారు. అట్టడుగునున్న వారికి రేషన్, ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యక్ష జోక్యం అవసరమన్నారు. ఇది  ప్రాథమిక హక్కుల్లో జీవించే హక్కును కాపాడటం కిందకే వస్తుందన్నారు. ఈ క్రమంలో సీజేఐకి లభిస్తున్న ఉచితాలంటో చెప్పాలని ట్విట్టర్ లో ప్రశ్నించారు. ఇక, ఎన్నికల సమయంలో చాలా ఉచిత వాగ్దానాలు మేనిఫెస్టోలో భాగం కావని కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యను కూడా ఆయన తిప్పికొట్టారు.

‘బీజేపీకి నిజం కావచ్చు కానీ మాకు కాదు. మా యూపీ  విధానసభ ఎన్నికల ప్రచార ప్రసంగాలలో మా మేనిఫెస్టో నుంచి పొందిన వాగ్దానాలన్నీ ఉన్నాయి. పార్టీలు మేనిఫెస్టోను ప్రకటించకుండా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు మాత్రమే ఈ సమస్యలు తలెత్తుతాయి. నిపుణులు, ప్రజల అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన మేనిఫెస్టో, సమయానుకూలంగా ప్రకటించాలి. తద్వారా ఓటర్లు కీలక సమస్యలను అర్థం చేసుకోగలరు. వాగ్దానాలు ప్రజాస్వామ్య ఓటింగ్ ప్రక్రియ యొక్క పవిత్రతను కాపాడుకోవడంలో అంతర్భాగం’ అని ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles