నడిరోడ్డుపై మహిళతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నా అక్కడి జనం చోద్యం చూశారు. నలుగురైదుగురు వ్యక్తులను నిలువరించే ప్రయత్నం అక్కడ వేడుక చూస్తున్న మనుషులకు లేకుండా పోయింది. ఆకాశంలో సగం అంటూ మహిళల హక్కుల కోసం నినదిస్తున్న క్రమంలో దేశంలో అత్యంత అరాచక ఘటన చోటుచేసుకుంది. నట్ట నడిరోడ్డుపై పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అదివాసి సామాజిక వర్గానికి చెందిన మహిళను వివస్త్రను చేసి.. అక్కడితో ఆగకుండా అమెపై దాడి చేశారు. అడ్డుకోబోయిన అమె భర్తను కూడా దారుణంగా కొట్టారు.
బీజేపి పాలిత రాష్ట్రంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వజ్రోత్సవ వేడుకలకు సిద్దమవుతున్న వేళ ఈ దారుణ ఘటన చోటుచేసుకోవడం.. దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఝాబెవా ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు తన భర్తను కాదని వేరే వ్యక్తితో జీవించేందుకు భర్తను విడిచి వెళ్లిపోయింది. తన ప్రియుడు ముఖేష్ కటారాతో కలిసి దగ్గర్లోని ఓ ఊళ్లో నివాసం ఉండేందుకు ఎనిమిది నెలల క్రితం ఇంటి నుంచి వచ్చేసింది. అయితే బుధవారం ఆమె తన భర్త ఇంటికి తిరిగి వచ్చేసింది. దాంతో ముఖేష్‌కు పట్టారాని కోపం వచ్చింది. దాంతో మరికొందరిని వెంటేసుకుని ముఖేష్ బాధితురాలి భర్త ఇంటి దగ్గరకు వచ్చాడు.
అనంతరం ముఖేష్ బాధితురాలిపై దాడికి పాల్పడ్డాడు. ముఖేష్‌తో పాటు ఉన్న వారు బాధితురాలు, ఆమె భర్తపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ముఖేష్‌తో పాటు వచ్చిన వ్యక్తులు మహిళ బట్టలు చింపడం, రాడ్లతో ఆమెపై దాడి చేయడం కనిపిస్తోంది. అది చూసిన కొందరు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ముఖేష్ తనను హింసించేవాడని, దాంతో తాను తిరిగి తన భర్త ఇంటికి వచ్చేశానని బాధితురాలు తెలిపిందని పోలీసులు తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసుకుని, అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more