Sea lions chase away sunbathers at US beach సముద్ర సింహాలను చూసి పర్యాటకులు పరుగులు..

Viral video shows sea lions chasing away beachgoers internet calls it interesting

Sea Lions chase away tourists, Sea Lions chase away sunbathers, Sea Lions La Jolla, Sea Lions San Diego, Sea Lions America, Sea Lions United states, Sea Lion, sea lion video, sea lion video viral, La Jolla, San Diego, San Diego beach, United States beach, beachgoers, sunbathing tourists,

Two sea lions chased away a group of people at a beach in La Jolla area of San Diego, according to a report in NBC San Diego. The video of the incident is going viral on social media platforms and shows beachgoers running away from the approaching animals. Lifeguards were on standby at the beach and ensured no one was injured. They also helped the sea lions leave the beach safely.

ITEMVIDEOS: సన్ బాత్ చేస్తున్న పర్యాటకులను తరిమిన సముద్ర సింహాలు

Posted: 07/11/2022 07:35 PM IST
Viral video shows sea lions chasing away beachgoers internet calls it interesting

సముద్రపు బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న సందర్శకులు.. కొందరు సముద్రంలో దిగి స్నానాలు చేస్తూ అహ్వాదాన్ని అస్వాదిస్తుండగా, మరికొందరు సముద్రపు ఒడ్డున ఇసుక తెన్నరపై సన్ బాత్ చేస్తూ సేద తీరుతున్నారు. అలా రిలాక్స్ అవుతున్న తరుణంలో పర్యాటకులను తరుముతూ రెండు సముద్ర సింహాలు అక్కడికి వస్తే.. ఎలా ఉంటుంది. అదే జరిగింది. సముద్ర తీరంలో బీచ్ లోని పర్యాటకులను సముద్ర సింహాలు అక్కడి నుంచి తరిమాయి. సముద్ర సింహాలను చూసిన పర్యాటకులు అవి ఎక్కడ తమపై దాడి చేస్తాయోనని పరుగులు తీశారు.

అమెరికాలోని శాన్ డియాగోలో ఈ సంఘటన జరిగింది. లా జోల్లా ప్రాంతంలోని బీచ్ వారాంతంలో సందర్శకులతో కిటకిటలాడింది. కొందరు సముద్రంలో జలకాలాడుతూ, కేరింతలు కొడుతూ ఎంజాయ్‌ చేయగా, మరికొందరు బీచ్‌లోని ఇసుకలో సేద తీరారు. కాగా, ఆ బీచ్‌ తీరంలో రెండు సముద్ర సింహాలు నిద్ర పోతున్నాయి. ఒక మహిళ ఫొటోలు తీసేందుకు వాటికి మరింత దగ్గరగా వెళ్లింది. దీంతో మేల్కొన్న ఆ సముద్ర సింహాలు ఆ మహిళతోపాటు బీచ్‌లో ఉన్న సందర్శకుల వెంటపడి తరిమాయి. బెదిరిపోయిన బీచ్‌లోని వారు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

మరోవైపు బీచ్‌ వద్ద ఉన్న రక్షకులు వెంటనే స్పందించారు. సముద్ర సింహాల బారినపడి ఎవరూ గాయపడకుండా చూశారు. అవి తిరిగి సముద్రంలోకి వెళ్లేలా చేశారు. కాగా, ఆ సమయంలో అక్కడ ఉన్న పర్యాటకురాలు చార్లియన్నే యేనా తన మొబైల్‌ ఫోన్‌లో ఈ వీడియో తీశారు. దీనిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అయ్యింది. అయితే సముద్ర సింహాలు వెంబడిస్తుండగా టూరిస్టులు భయంతో పరుగులు తీస్తుండటాన్ని చూడటం తనకు వింతగా అనిపించిందని, అందుకే వీడియోను రికార్డు చేసినట్లు స్థానిక మీడియా సంస్థకు ఆమె వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles