Youth assaults SI inside police station ఠాణాలోనే పోలీసు అధికారిపై చేయిచేసుకున్న యువకుడు

Uttar pradesh cop assaulted in police station by man accused of domestic violence

Man thrashed police official, Mentally ill man thrashed police, counselling in a case of domestic violence, Family Members, Mental illness, Abusive language, woman constable, violent behaviour, Mainpuri police station, Mainpuri ASP, Madhuvan Kumar, Mainpuri Uttar Pradesh, Crime

A man lost his temper and thrashed a police official inside Mainpuri police station in Uttar Pradesh, on Tuesday. He had been called for counselling in a case of domestic violence. A woman constable can be seen trying to stop the fight, as she approaches the man with a chair in her hand to block him from thrashing the cop.

ITEMVIDEOS: ఠాణాలోనే పోలీసు అధికారిపై చేయిచేసుకున్న యువకుడు

Posted: 07/05/2022 04:34 PM IST
Uttar pradesh cop assaulted in police station by man accused of domestic violence

స్థానబలం అంటే తెలుసుగా.. ఫలానా స్థానంలో ఫలానావారికి బలం అధికంగా ఉంటుందని అర్థం. మరీ ముఖ్యంగా క్రికెట్ లో ఈ పదం చాలా వింటూవుంటాం. ఫలానా మైదనాంలో ఫలానా జట్టుకు బాగా కలసివస్తోంది. వారి ట్రాక్ రికార్డు బాగుందీ అని. ఇక మరోలా చెప్పాలంటే నీటిలో మొసలి స్థానబలం బాగా కలిసిరాగా, నేలపై సింహాలు, చిరుతలు, పులులకు స్థానబలం బాగా ఉంటుంది. అలానే సమాజం మొత్తంగా పోలీసులకు చక్కని స్థానబలం. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం చోరులు, స్మగర్లు, దొంగలకు స్థానబలం బాగా ఉంటుంది. ఇలా స్థానబలం బాగా కలిసివచ్చే చోట వారే విజయాలను ఎక్కువగా ఆస్వాధిస్తారన్నది జగమెరిగిన సత్యం.

ఇలానే పోలీసులుకు పోలీస్ స్టేష‌న్‌ అత్యంత అధికంగా కలసివచ్చే చోటు. ఇలాంటి ప్రాంతంలో పోలీసు అధికారిపై ఓ వ్య‌క్తి దాడికి దిగాడు. పోలీసు అడ్డుకునే ప్రయత్నం చేయగా, దాడితోనే సమాధానం చెప్పాడు. ఒక మహిళా కానిస్టేబుల్ కూడా జోక్యం చేసుకున్నా.. అమెను కంటి చూపుతోనే బెదిరించే ప్రయత్నం చేశాడు. తీరా పోలీసులు అతడ్ని పట్టుకున్న తరువాత అతడు మతిస్థిమితం లేని వ్యక్తిగా తేలింది. అంటే వీరికి అన్ని ప్రాంతాల్లోనూ స్థానబలం బాగానే కలసివస్తుందన్న మాట. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో జ‌రిగింది.

గృహహింస కేసులో సదరు నిందితుడ్ని కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు స్టేషన్ కు పిలిపించారు. అయితే ఈ విషయం తెలియని స్టేషన్ ఎస్ఐ.. అప్పుడే పోలిస్ స్టేషన్ కు రాగా, ఎదురుగా నిలబడటంతో ఏంటని విచారించాడు. అంతే నోటికి వచ్చిన బండబూతులు తిడుతూ.. దుర్భాషలాడాడు. అవి విన్న మహిళా కానిస్టేబుల్ ఇలానేనా మాట్లాడేదని సంజ్ఞతో చెప్పింది. అయినా అలానే మాట్లాడుతుండగా, ఎస్ఐ అతడ్ని భుజం పట్టుకుని లోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, ఉన్మాదిలా ప్రవర్తించాడు. తన భుజంపై చేయి వేయగానే అదే చేతితో ఎస్ఐపై దాడికి పాల్పడ్డాడు.

అనూహ్య పరిణామంతో బిత్తరపోయిన ఎస్ఐ అతడ్ని అడ్డుకున్నాడు. అయినా అగంతకుడు ఆగకుండా ఎస్ఐపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఎస్ఐ అతడ్ని అపే ప్రయత్నంలో కింద పడేసాడు. రెచ్చిపోయిన ఉన్మాదంతో నన్నే కిందపడేస్తావా.? అంటూ రెచ్చిపోయిన ఆగంతకుడు.. ఎస్ఐపై దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ చూసిన ఓ మహిళా కానిస్టేబుల్ బిత్తరపోయి పక్కకు జరిగింది. అయితే మరో మహిళా కానిస్టేబుల్ మాత్రం ఎస్ఐపై ఆగంతకుడు దాడి చేయకుండా అక్కడే ఉన్న కుర్చీని తీసుకెుని అడ్డుగా నిలిపి.. దాడి చేయకుండా అడ్డుకోగలిగింది.

అయినా ఉన్మాది దాడికి చేస్తూనే ఉండడంలో పోలీసులను పిలిచింది. వారు రాగానే స్టేషన్ లోని మరో గదిలోకి పారిపోయిన ఆగంతకుడన్ని పట్టుకున్న పోలీసులు అరెస్టు చేశారు. మతిస్థిమితం సరిగా లేనందువల్లే అతడు ఇలా తీవ్రంగా ప్రవర్తిస్తాడని అతడి కుటుంబసభ్యులు తెలిపారు. అయితే అందుకు సంబంధించి వైద్యులు సిఫార్సు చేసిన మెడికల్ సర్టిఫికేట్ సమర్పిస్తే అతనిపై చర్యలు తీసుకునే విషయమై పునరాలోచన చేస్తామని పోలీసులు అధికారులు తెలిపారు.  అయితే ఆవేశానికి లోనైన స‌దరు వ్య‌క్తి స‌హ‌నం కోల్పోయి.. కోపంతోనే పోలీసు అధికారిపై ముష్టిఘాతానికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles