అమెరికా ఇటీవల తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. కేవలం రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యంలో ఏకంగా 35 మంది ప్రాణాలను ఎందుకు తాము టార్గెట్ గా మారామో కూడా తెలియకుండానే బలైపోయాయి. అందుకు కారణం తుపాకీ తూటాలు. అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఘటనల్లో వారంలో ఏదో ఒక చోట అమాయకుల ప్రాణాలు అనంత వాయువుల్లో కిలిసిపోతున్నాయి. దీంతో అమెరికా తుపాకి సంస్కృతిపై చర్చ మొదలైంది. తుపాకులను నిషేధించాలన్న డిమాండ్ కూడా వచ్చింది. ఇటీవల జరిగిన టెక్సాస్ లోని ప్రైమరీ పాఠశాల మరణాలపై దేశం మొత్తం ఒక్కటై ముక్తకంఠంతో ఖండించింది.
అధికారంలోని ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న మరణాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. అమెరీకన్ వాసులు తుపాకులు కలిగివుండటం ఆత్మరక్షణలో భాగమేనని.. ఇది తమ వ్యక్తిగత హక్కుగా కూడా పేర్కోంటున్న తరఉనంలో అదే తుపాకులు ప్రాణాలను విచ్చలవిడిగా బలిగొంటున్న తరుణంలో ప్రభుత్వాలు వాటిని నియంత్రించే చర్యలకు పూనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరోమారు చర్చనీయాంశమైంది. బహిరంగంగా తుపాకులు కలిగి ఉండడం అమెరికన్ల హక్కని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 6-3 మెజారిటీతో న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించారు.
న్యూయార్క్, లాస్ఏంజెలెస్, బోస్టన్ తదితర పెద్ద నగరాలు సహా అన్ని ప్రాంతాల్లోనూ పౌరులు తమ వెంట తుపాకులు తీసుకెళ్లొచ్చని, వ్యక్తిగత రక్షణకు బహిరంగంగా తుపాకి కలిగి ఉండడం ఓ వ్యక్తి హక్కు అని జస్టిస్ క్లారెన్స్ థామస్ తన తీర్పులో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా న్యూయార్క్ గతంలో చేసిన చట్టాన్ని కోర్టు కొట్టివేసింది. తుపాకి సంస్కృతికి అడ్డుకట్ట వేసేలా ఓ చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్న బైడెన్ సర్కారు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న ఆసక్తి మొదలైంది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more