PM Modi instructs to recruit 10 lakh Vaccancies ఏడాదిన్నరలో 10లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రధాని అదేశం..

Pm modi s mega employment push directs 10 lakh recruitments in 18 months

pm modi ten lakh jobs, pm modi employment push, PMO mission mode announcement, Government jobs, PMO India, Prime Minister Modi, Central Government, Government employment, Central government jobs, Sarkari jobs

Prime Minister Narendra Modi on Tuesday reviewed the status of human resources across all government departments and ministries, thereby instructing that the recruitment of ten lakh people be carried out in the next 18 months, the Prime Minister's Office (PMO) tweeted.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏడాదిన్నరలో 10లక్షల ఉద్యోగాలకు ప్రధాని అదేశం..

Posted: 06/14/2022 04:42 PM IST
Pm modi s mega employment push directs 10 lakh recruitments in 18 months

దేశంలో ఏడాదికి రెండు కోట్ల మేర ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన ప్రభుత్వంపై మెల్లిగా ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించాయి. ప్రతిపక్షాలతో పాటు ఏకంగా సొంతపార్టీ ఎంపీ కూడా విమర్శలు చేశారు. దేశంలో యువతకు ఉద్యోగం కల్పిస్తేనే వారితో పాటు దేశం కూడా ధృడంగా ఉంటుందని సూచనలు చేశారు. ఇలా సూచనలు చేశారో లేదో ప్రధాని మంత్రి కార్యాలయం అత్యంత వేగంగా స్పందించింది. దేశంలోని నిరుద్యోగులకు శుభవార్తను తెలిపింది. రాబోయే ఏడాదిన్న‌ర కాలంలో 10 ల‌క్ష‌ల ఉద్యోగాలను క‌ల్పించ‌నున్న‌ట్లు ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం ఇవాళ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తెలిపింది. కేంద్ర క్యాబినెట్ సమావేశమైన తరువాత కేంద్ర ఆర్థిక విధానాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో నిరుద్యోగంపై కూడా ప్రకటనను వెలువరించింది. అన్ని శాఖ‌ల‌కు సంబంధించిన మాన‌వ వ‌న‌రులను ప్ర‌ధాని మోదీ స‌మీక్షించార‌ని, రాబోయే 1.5 ఏళ్ల‌లో ఉద్యోగాల భర్తీ ఓ య‌జ్ఞంగా కొనసాగనుందని ఆ ట్వీట్‌లో తెలిపారు. 10 ల‌క్ష‌ల ఉద్యోగాల భ‌ర్తీ కోసం డిసెంబ‌ర్ 2023ను డెడ్‌లైన్‌గా ఫిక్స్ చేశారు. 18 నెల‌ల్లోనే రిక్రూట్మెంట్లు పూర్తి కావాల‌న్నారు. నేష‌న‌ల్ స్టాటిస్‌టిక‌ల్ ఆఫీసు నిర్వ‌హించిన పీరియాడిక్ లేబ‌ర్ ఫోర్స్ స‌ర్వే ద్వారా ఉద్యోగులు, నిరుద్యోగుల డేటాను సేక‌రించిన‌ట్లు కార్మిక శాఖ తెలిపింది.

ఇది దూరదృష్టితో కూడిన నిర్ణయంగా అభివర్ణించిన హోం మంత్రి అమిత్ షా, ఇది భారతదేశంలోని నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన యువతను ఆర్థిక సాధికాకరతతో ఫిట్ గా ఉంచేందుకు దోహదం చేస్తుందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్' నినాదానికికి ఇది నిజమైన పునాది అవుతుందని ఆయన అన్నారు. కాగా కాంగ్రెస్ మాత్రం ప్రధాని మంత్రి ఉద్యోగ కల్పనను విమర్శించింది. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగం కల్పిస్తామని ఎన్నికల హమీని ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ.. ఎనిమిదేళ్లకు కేవలం పది లక్షల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తామనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

ఈ ప్రకటనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు, ఇది 'జుమ్లాస్' కాదు, 'మహా జుమ్లా'ల ప్రభుత్వమని అన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎనమిదేళ్ల క్రితం యువతను ఎలా మోసం చేశారో, అదే రీతిలో ఇప్పుడు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మరోమారు మోసానికి తెరలేపారని మండిపడ్డారు. ప్రధాని మోడీ ఉద్యోగాల కల్పిస్తామని హామీలిచ్చే వార్తలు సృష్టించడంలో నిపుణుడు అని గాంధీ విమర్శించారు. కాగా, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు కోటికి పైగా 'మంజూరై.. ఖాళీగా ఉన్న' పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు. ఇక ప్రధాని తన రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ ఎన్నికల హామీని నిలబెట్టుకునేందుకు మరిన్ని ప్రయత్నాలు చేయాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles