2 killed, 4 wounded in shooting at nightclub in Gary అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం.. చికాగోలో..

Chicago 2 killed 4 wounded in shooting at indiana nightclub say police

NightClub shooting, Gary night club shooting, Indiana night club shooting, Chicago shooting, chicago gun fire, Two killed, Maryland, Smith bird shooting, texas school shooting, mary land smithbird shooting, maryland smithbird gun firing, texas shooting, shooting in America, America, United States, Crime

Two people were killed and four others were wounded in a shooting at an Indiana nightclub early Sunday, police said. Officers responding to reports of shots fired around 2 am in Gary, southeast of Chicago, said they found two people who had been shot and were unresponsive. A 34-year-old man was near the entrance to Playo's NightClub and a 26-year-old woman was found inside, police said.

అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం.. చికాగోలో వారం రోజల్లో రెండో ఘటన.. ఇద్దరు మృతి

Posted: 06/13/2022 02:34 PM IST
Chicago 2 killed 4 wounded in shooting at indiana nightclub say police

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ కాల్పుల శరామామూలుగా మారుతున్నాయా.? అగ్రరాజ్య పరిపాలకులు ఈ కాల్పులపై తమ సానుభూతిని వ్యక్తం చేయడం తప్పితే.. దేశంలో కాల్పులు శబ్దాలు వినపించకుండా చర్యలు తీసుకోలేరా.? అంటే పాలకులే సమాధానాలు చెప్పాల్సివుంటుంది. వరుసగా వినిపిస్తున్న తుపాకీ కాల్పుల శబ్దాలలో అమాయక అగ్రరాజ్యవాసులే మృత్యువాత పడుతున్నారు. ఇక దేశపురోగాభివృద్దిలో తమ వంతు పాత్రను పోషిస్తున్న ఎందరో పౌరులు గాయాలపాలవుతున్నారు. కొందరు అంగవైకల్యం బారినపడుతున్నారు. ఈ సంస్కృతి కారణంగా ఎందరో చిన్నారులు.. తాము కన్న కలల్ని సాకరం చేసుకోకుండానే అగంతకుల తుపాకీ తూటాల అడ్డుకుంటున్నాయి.

అగ్రరాజ్యంలోని టెక్సాస్ నగరం, ఉవాల్డేలోని ఎలిమెంటరీ పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు తుపాకీతో పాఠశాలలోని తరగతి గదిలోకి ప్రవేశించి.. 19 మంది విద్యార్థులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులను కాల్చిచంపిన విషాదం ఘటన నుంచి అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు సంభవిస్తున్నాయి. అగ్రరాజ్యంలో తుపాకీ పేలుళ్ల వరుస ఘటనలు చోటుచేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎలిమెంటరీ స్కూల్ కాల్పుల ఘటన తరువాత ఏకంగా అగ్రరాజ్యంలో ఇప్పటివరకు వరుసగా ఆరు ఘటనలు జరిగినట్లు సమాచారం.

ఇక తాజాగా చికాగోలో కాల్పులమోత దద్దరిల్లింది. మేరీల్యాండ్ లోని స్మిత్ బర్డ్ ఘటన విషాదాన్ని మరువకముందే చికాగోలోని ఇండియానా నైట్‌క్లబ్‌లో అగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో దుండగుడి కాల్పులకు ఇద్దరు ఘటనాస్థలంలోనే మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డాగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో చికాగోలో వారం రోజుల వ్యవధిలో తుపాకీకి ఆరుగురు బలయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు.

కాగా అగంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అగ్రరాజ్యంలోని చికాడో పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం.. పశ్చిమ మేరీల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కొలంబియా మెషీన్‌ అనే కంపెనీలోకి చొరబడ్డ ఓ సాయుధుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే భద్రతాసిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడితో పాటు ఓ పోలీసు గాయపడ్డాడు. ఈవిధంగా అగ్రరాజ్య యువతలో నేరప్రవృత్తి పెరుగుతన్నా ఇంకా ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే.. అగ్రరాజ్యానికి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం పోంచివుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles