Husband Divorces Wife For Cooking Maggi Every Day ‘‘మ్యాగీ తప్ప మరోకటి వండటం రాదని భార్యకు విడాకులు’’

Man filed for divorce because his wife served him only maggi noodles for all meals

Maggi, Noodles, Divorce, Husband, Wife, matrimonial cases, couples divorce over minor issues, couples file for divorce, Ballari District, principal district and sessions court judge, judge ML Raghunath, maggi divorce, husband wife, ballari, instant noodles, divorce cases, family court, maggi, maggi noodles, nestle maggi, divorce, maggi for lunch, maggi for dinner, maggi for breakfast, ballari couple, mysore judge, petty issues for divorce, Karnataka, Crime

Maggi is a popular breakfast, lunch, and dinner dish. It is a great option especially if you don't know how to cook. When asked about matrimonial cases where couples file for divorce over minor issues, principal district and sessions court judge ML Raghunath said that this case came up when he was the district judge in Ballari, Karnataka.

మ్యాగీ.. మూడు పూటలు.. వారానికి ఏడు రోజులు.. విసుగెత్తిన భర్త..

Posted: 05/31/2022 06:05 PM IST
Man filed for divorce because his wife served him only maggi noodles for all meals

ఎంతటి కమ్మని వంటకమైనా సరే రోజుకోసారి మాత్రమే దానిని ఆస్వాదించవచ్చు. చిన్నారులైతే.. రోజుకు రెండు పూటలా అస్వాధిస్తారు. కానీ రోజుకు మూడు పూటలు.. అదే అంటే ఎవరికైన విసుగెత్తుతుంది. అయితే ఏదోలే వారినికి ఒక రోజు తప్పదులే అని అడ్జస్ట్ అవుదామని అనుకుంటున్నారా..? అక్కడే వుంది అసలు ట్విస్టు.. ఇలా వారానికి ఏడు రోజులు చేస్తే.. అంటే టిఫిన్‌, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అంతా ఒకే వంటకమైతే.. దాన్ని చూస్తేనే దడుచుకుంటారు. కానీ ఇక్కడా వ్యక్తికి ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే అమెకు అది తప్ప వేరే వంటకం వండలమే రాదు. మరి అలాంటప్పుడు.. ఏం చేస్తారు..

ఇప్పుడు మాత్రం ఆమె భర్త చేసింది కరెక్టు అని అనకండీ.. ఈ రోజుల్లో యూట్యూబ్ టీచర్ అందుబాటులో ఉండి అన్నీ నేర్పిస్తుండగా, ఆమె భర్త మాత్రం అమెను నోప్పించకుండా ఒప్పించి మరీ విడాకులు తీసుకున్నాడు. ఔనా.. ముదితల్ నేర్వగలేని విద్యగలదే ముద్దారగ నేర్పినన్ అనే నానుడి విని ఉండడు కాబోలు. ఇంతకీ అమె చేసిన ఆ వంటకమేంటీ అంటారా.. అదే మ్యాగీ. టూ మినట్ నూడుల్స్. ఒక వ్యక్తి భార్యకు కేవలం ఇది మాత్రమే వండటం తెలుసు. నూడుల్స్‌ తప్ప ఇంకేమీ చేయడం ఆమెకు రాదు. దీంతో మూడు పూటలు మ్యాగీ తినలేక విసిగిపోయిన ఆ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

ప్రస్తుతం పెళ్లిళ్లతో పాటు విడాకులు కూడా ఇన్‌స్టెంట్‌గా మారుతున్న తీరుకు ఇది ఉదాహరణగా నిలుస్తున్నది. బంధాలకు, అనుబంధాలకు మధ్య ఉన్న బంధం ఎంత సున్నితంగా మారుతుందో తెలిపే ఈ ఘటనను మైసూరు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఎల్‌ రఘునాథ్‌ మీడియాతో పంచుకున్నారు. ఈ ఘటన తాను బళ్లారి జిల్లా జడ్జిగా ఉన్నప్పుడు జరిగిందని ఈ ఆసక్తికరమైన మ్యాగీ విడాకుల కేసును ఆయన గుర్తు చేశారు. భార్య వంటపై విసుగెత్తిన ఒక వ్యక్తి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. రోజూ మూడు పూటలా అదే వండింది. ఇది తప్ప ఆమెకు మరో వంటకం చేయడం రాదని తెలిసి విసుగెత్తిన భర్త విడాకులు కోరాడు’ అని చెప్పారు.

కాగా, ఆ భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారని న్యాయమూర్తి ఎంఎల్‌ రఘునాథ్‌ తెలిపారు. ఈ విడాకులను ‘మ్యాగీ కేసు’గా ఆయన అభివర్ణించారు. చాలా చిన్న కారణాలతో భార్యాభర్తలు విడాకులు కోరుతున్నారని, ఇలాంటివి ఎన్నో తాను చూశానని అన్నారు. బోజనం చేసేప్పుడు ప్లేట్‌లో ఉప్పును తప్పువైపు వేయడం, పెళ్లికి తగిన కలర్‌ డ్రెస్‌ తీసుకురావకపోవడం వంటివి ఎన్నో విడాకుల కేసులు ఉన్నాయన్నారు. ఒక వ్యక్తిని పాము కాటేసిందని, ఇందులో భార్య తప్పులేకపోయినా దానికి ఆమే కారణమంటూ విడాకులు కోరిన మరో ఆసక్తికర కేసును ఆయన గుర్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles