Youth from Vemulawada drowned in USA అమెరికాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు తెలుగువాళ్ల మృతి

Woman killed after parasail struck old seven mile bridge

Kante Yeshwanth, Ireland‌, Island, Boating, drowning, vemulawada, telangana, supraja, parasailing, marturu, bapatla, chintapallipadu, Andhra PradeshKante Yeshwanth, Ireland‌, Island, Boating, drowning, vemulawada, telangana, supraja, parasailing, marturu, bapatla, chintapallipadu, Andhra Pradesh

Two Telugu People died in seperate incidents in Unites States, Both hail from India, one from Telangana and another from Andhra Pradesh. A 26 yrs old Youth from Subashnagar, Vemulawada went to US 8 months ago to persue MS computers had beeb drowned near florida. In another Incident a woman died when a parasail struck the old Seven Mile Bridge in the Florida Keys. airlifted to Nicklaus Children’s Hospital after initially being taken to Fishermen’s Community Hospital.

అమెరికాలో ఇద్దరు తెలుగువాళ్ల మృతి.. రాకాసీ అలతో ఒకరు.. పారసెయిలింగ్ తో మరోకరు..

Posted: 05/31/2022 07:07 PM IST
Woman killed after parasail struck old seven mile bridge

అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు తెలుగువాళ్లు మరణించారు. ఈ రెండు ఘటనలు రమరామి ఫ్లోరిడాకు చేరువలోనే చోటుచేసుకున్నాయి. ఈ రెండు ఘటనలకు నీటితో ముడిపడినవే కావడం గమనార్హం. అమెరికాకు వెళ్లి పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తాడని కలలు కన్న ఆ కన్నవారు ఎదురుచూస్తున్నా.. ఆ బిడ్డ మాత్రం తిరిగి రాలేని లోకాలకు తరలివెళ్లాడు. విదేశాల్లో ఎంఎస్ కంప్యూటర్స్ కోసం వెళ్లిన వేములవాడ సుబాష్ నగర్ కు చెందిన కంటే యశ్వంత్.. తన స్నేహితులతో కలసి విహారయాత్రకు వెళ్లి అక్కడ సముద్రంలో శవమై తేలాడు.

స్నేహితులతో కలసి వీకెండ్ సరదాగా గడపటం కోసం ఈనెల 29వ తేది ఐర్లాండ్‌లోని ఓ ద్వీపానికి బోటింగ్‌‌కి వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా ఎంజాయ్ చేసిన వారు సాయంత్రం తిరిగివస్తున్న క్రమంలో నడిసముద్రంలో పడవ అగిపోయింది. దీంతో సముద్రంలోకి పడవ మునిగిపోతుండడంతో.. సముద్రంలోకి దూకి తరువాత మళ్లీ పడవను అందుకున్నామని అనుకున్నాడు. కానీ అంతలో రాకాసి అల వచ్చి అతడ్ని మింగేసింది. ఆ వెంటనే లైప్ జాకెట్లు వేసుకుని అతని మిత్రులు సముద్రంలో వేతికినా యశ్వంత్ కనిపించలేదు. దీంతో అటు ప్లోరిడాలోని విశ్వవిద్యాలయంతో పాటు ఇటు వేములవాడలో విషాధఛాయలు అలుముకున్నాయి.

మరో ఘటనలో పారాసెయిలింగ్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 34 ఏళ్ల వివాహిత మృతి చెందింది. ఏపీలోని బాపట్ల జిల్లా మార్టూరు మండల పరిధిలోని చింతపల్లిపాడు  చెందిన ఆలపర్తి శ్రీనివాసరావు భార్య సుప్రజ నదిలో పారాసెయిలింగ్ చేస్తుండగా, వేగంగా వచ్చిన గాలుల తాకిడి అమె ఉన్న పారాసెయిల్ ఆ పక్కనే వున్న వంతెనను గట్టిగా ఢీకొనింది. ఈ ఘటనలో అమె అక్కడికక్కడే మరణించగా, అమె బిడ్డ మాత్రం గాయపడింది. హుటాహుటిన అక్కడకు చేరుకున్న రెస్క్యూటీమ్ చిన్నారిని స్థానిక మత్స్యకారులు కమ్యూనిటీ అసుపత్రిలో ప్రథమ చికి్త్సను అందించి అక్కడి నుంచి నికోలస్ చిల్డ్రన్స్ అసుపత్రికి తరలించారు. ఆలపర్తి శ్రీనివాసరావు.. 2012లో అమెరికా వెళ్లి చికాగోలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డారు.

కొంతకాలం కిందట వీరి కుటుంబం ఫ్లోరిడాకు మారింది. కాగా, ఇతర కుటుంబాలతో కలిసి సుప్రజ, శ్రీనివాసరావు కుటుంబం విహారయాత్రకు వెళ్లగా, అది విషాదాంతంగా మారింది. తమ పిల్లలు అక్షత్ చౌదరి (10), శ్రీ అధిరా (6)లను కూడా విహారయాత్రకు తీసుకెళ్లారు. అయితే, కుమారుడు అక్షత్ తో కలిసి సుప్రజ బోట్ పారాసెయిలింగ్ చేస్తుండగా, బలమైన గాలులు వీయడంతో ఆ పారాచ్యూట్ ను బోటుకు అనుసంధానించిన తాళ్లు తెగిపోయాయి. దాంతో, ఆ పారాచ్యూట్ ఓ వంతెనకు బలంగా తగలడంతో ప్రమాదం సంభవించింది. తీవ్రగాయాలపాలైన సుప్రజ ప్రాణాలు విడవగా, కుమారుడు అక్షత్ కు తేలికపాటి గాయాలయ్యాయి. సుప్రజ మరణంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles