అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు తుపాకీ కాల్పులు దద్దరిల్లాయి. అందులోనూ అగ్రరాజ్య విద్యార్థులు విద్యను అభ్యసించే పాఠశాలల్లో కాల్పుల మోత మ్రోగగం గమనార్హం. ఈ సారి అమెరికాలోని టెక్సాస్‌లో తుపాకి గుళ్ల మోతతో పాటుగా విద్యార్థులు, ఉపాధ్యాయుల, నాన్ టీచింగ్ స్టాప్ హాహాకారాలు మిన్నంటాయి. ఏకంగా 21 మంది ఈ కాల్పుల ఘటనలో మరణించడంతో అహ్లాదకరంగా ఉండాల్సిన పాఠశాల వాతావరణం ఒక్కసారిగా విషాధకరంగా మారిపోయింది. ప్రాథమిక పాఠశాలలోకి చొరబడిన ఓ 18 ఏళ్ల యువకుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ఫలితంగా ఏకంగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరణించిన వారిలో 18 మంది చిన్నారులు, ఓ టీచర్, నాన్ టీచింగ్ స్టాప్ సహా హంతకుడు కూడా ఉన్నాడు. మెక్సికన్ సరిహద్దులోని ఉవాల్డే పట్టణంలోని రోబ్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులందరూ 11 ఏళ్లలోపు వారేనని అధికారులు తెలిపారు. తమ బిడ్డలకు లంచ్ ఏం తీసుకెళ్లాలని అలోచించి.. వంట తయారు చేస్తున్న తల్లిదండ్రులకు ఈ విషాదకర వార్త తెలిసి హుటాహుటిన పాఠశాల ఆవరణకు పరుగులు తీశారు. ఉదయం ఆడుకుంటూ.. ఎంతో ఉత్సాహంగా పాఠశాలకు తరలివెళ్లిన తమ పిల్లలు తిరిగి ఇంటికి వస్తారని ఎదురుచూసిన తల్లలకు హంతకుడు గర్భశోకం మిగిల్చాడు.
చిన్నారులు, పసివాళ్ల ముఖాలు చూసిన తరువాత కూడా హంతకుడికి ఎలా కాల్పలు జరపాలని అనిపించిందని మృతుల తల్లిదండ్రులు కన్నీటీసంద్రమయ్యారు. స్థానికంగా తీవ్ర విషాధాన్ని నింపిన ఈ ఘటనతో పాఠశాలలో బీతావాహ వాతావరణం అలుముకుంది. కాగా, దుండగుడు కాల్పులు జరిపిన ఈ పాఠశాలలో ఏకంగా 500మంది కంటే ఎక్కువ మందే చదువుకుంటున్నట్టు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. దుండగుడు హ్యాండ్‌గన్‌తో పాఠశాలలోకి చొరబడ్డాడని, అతడి వద్ద రైఫిల్ కూడా ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడని గవర్నర్ తెలిపారు.
కాగా, అమెరికాలో 2018 తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన ఘటన ఇదేనని అధికారులు తెలిపారు. ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో అప్పట్లో జరిగిన కాల్పుల్లో 14 మంది హైస్కూల్ విద్యార్థులు సహా ముగ్గురు టీచర్లు మృతి చెందారు. 2020లో అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనల్లో 19,350 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఏడాది అమెరికాలో స్కూల్ షూటింగ్ ఘటనలు 27 జరిగినట్లు తెలస్తోంది. అమెరికాలో 2018 సంవత్సరం నుంచి స్కూల్ షూటింగ్స్ జరుగుతన్న ఘటనల డేటాను ఎడ్యుకేషన్ వీక్ అనే సంస్థ పొందుపరుస్తోంది. ఆ సంస్థ డేటా ప్రకారం ఇప్పటి వరకు 2018 నుంచి ఆ దేశంలో 119 స్కూల్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది.
అమెరికాలో ఈ ఏడాది కాల్పుల ఘటనలు అత్యధిక స్థాయిలో నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 200 సామూహిక కాల్పుల ఘటనలు జరిగాయి. ద గన్ వాయిలెన్స్ ఆర్కీవ్ దీనికి సంబంధించిన డేటాను తయారు చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 212 సామూహిక కాల్పుల ఘటనలను జరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది కాల్పుల్లో మరణిస్తే ఆ ఘటనను సామూహిక కాల్పుల ఘటనగా గుర్తిస్తారు. గన్ వాయిలెన్స్ ఆర్కివ్ ప్రకారం అమెరికాలో 2021 సంవత్సరంలో 693 సామూహిక కాల్పుల ఘటనలు జరిగాయి. 2020లో సుమారు 611 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. 2019లో ఆ సంఖ్య 417గా ఉంది.
అమెరికా తుపాకీ సంస్కృతిపై ఆ దేశాధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. దేవుడా ఇంకెప్పుడు ఈ తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడుతామని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్సాస్‌లో స్కూల్ విద్యార్థులపై కాల్పుల ఘటన స్పందించిన ఆయన అమెరికాలో మరో సామూహిక హత్య జరిగినట్లు చెప్పారు. అందమైన, అమాయక, చిన్న పిల్లల్ని కర్కోటక హంతకులు పొట్టన పెట్టుకున్నారని, తమ స్నేహితులు తమ కళ్లముందే చనిపోతుంటే..ఆ చిన్నారులు మనసులపై ఈ విలయాన్ని ఎంతటి గాయాలను చేసిందోనని ఆయన అందోళన వ్యక్తం చేశారు.
అహ్లాద, ఉత్సహభరిత వాతావరణం నెలకొన్న పాఠశాలలో బీతావాహ పరిస్థితులు ఉత్పన్నం కావడం.. ఆ చిన్నారి గుండెలు ఎంతటి ప్రభావం చూపుతుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడా ఈ తుపాకీ సంస్కృతిని అంతం చేయడం ఎలా అన్న రీతిలో బైడెన్ స్పందించారు. చిన్నారుల్ని కోల్పోవడం అంటే అది మన గుండెను గుచ్చడమే అన్నారు. ఇది తన శ్వాసను పట్టేసినట్లుగా ఉందన్నారు. బాధితుల కోసం నివాళి అర్పించాలని, గన్ సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. గన్ లాబీకి వ్యతిరేకంగా ఎప్పుడు పోరాటం చేస్తామని, మనకు ఇంకెంత ధైర్యం కావాలని ఆయన ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more