సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ వైఎస్ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్టుమెంటులో రిపోర్ట్ చేయాలవి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు గవర్నమెంటు అర్డర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన అదేశాల కాఫీ ఇవాళ సీనియర్ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావుకు అందాయి.
కాగా, గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీవీ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై వైసీపీ ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది. దీంతో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, తనకు కేటాయించిన విధులను అంకితభావంతో నిర్వహించానని పేర్కోంటూ ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై సుదీర్ఘ కాలంగా న్యాయపోరాటం చేశారు. తన సస్పెన్షన్‌పై హైకోర్టు, సుప్రీం కోర్టులను కూడా ఆశ్రయించారు. ఈ మధ్యే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ సుప్రీం తీర్పు వెలువరించింది. వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరోవైపు. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ గతంలోనే ఏపీ హైకోర్టు కూడా తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు కూడా ఆ ఆదేశాలే ఇచ్చింది. ఫిబ్రవరి 7వ తేదీతో ఏబీ వెంకటేశ్వరరావు రెండేళ్ల సస్పెన్షన్ ముగిసినట్టేనని, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఆయనకు ఇవ్వాల్సిన జీతభత్యాలను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసిన కోర్టు.. వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశించింది. ఇక, సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఈ మధ్యే రెండు మూడు సార్లు సచివాలయానికి వచ్చారు ఏబీ వెంకటేశ్వరరావు. యూనిఫాం ధరించి మరి సచివాలయంలో అడుగుపెట్టారు. ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా సస్పెన్షన్ ఎత్తివేడం.. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించడంతో.. ఆయన సేవలను ప్రభుత్వం ఎలా వినియోగించు కోనుందో అనే అంశమై సర్వత్రా ఆసక్తి నెలకోంది.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more