Tripura Chief Minister Biplab Deb tenders resignation త్రిపుర ముఖ్యమంత్రిగా తప్పుకున్న విప్ల‌వ్ దేవ్.. పదవికి రాజీనామా..

Tripura cm biplab kumar deb submits resignation to governor ahead of 2023 polls

Biplab Kumar Deb, Tripura CM, Biplab Kumar Deb Resignation, Biplab Deb Resignation, Tripura CM Resignation, Tripura CM Sacked, BJP Tripura, Biplab Deb resigns, Tripura CM resigns, Tripura CM quits, Biplab Deb, Biplab Deb resigns, Biplab Deb news, Politics

In an unprecedented move, Tripura Chief Minister Biplab Kumar Deb has tendered his resignation to Governor Satyadeo Narain Arya, news agency PTI reported. According to reports, Bharatiya Janata Party (BJP) is likely to chair a meeting later in the day to choose a new Chief Minister for the state. Deb made the announcement after meeting the governor at the Raj Bhavan in Agartala.

త్రిపుర ముఖ్యమంత్రిగా తప్పుకున్న విప్ల‌వ్ దేవ్.. పదవికి రాజీనామా..

Posted: 05/14/2022 05:38 PM IST
Tripura cm biplab kumar deb submits resignation to governor ahead of 2023 polls

త్రిపుర ముఖ్య‌మంత్రి విప్ల‌వ్ దేవ్ త‌న ప‌ద‌వికి శ‌నివారం రాజీనామా చేశారు. త‌న రాజీనామాను త్రిపుర గ‌వ‌ర్న‌ర్ ఎస్‌.ఎన్‌. ఆర్య‌కు స‌మ‌ర్పించారు. మ‌రో ఆరు నెల‌ల్లో త్రిపుర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఇప్పటికే త్రిపురలో పాగావేసేందుకు ఓ వైపు పశ్చిమ బెంగాల్ లోని అధికార తృణముల్ కాంగ్రెస్ కూడా బలంగానే పావులు కదుపుతోంది. మమతా బెనర్జీ మేనల్లుడు అభినవ్ ముఖర్జీ నేతృత్వంలో త్రిపురలో తృణముల్ కాంగ్రెస్ లోకి వలసలు ఇప్పటికే ఓ స్థాయికి చేరుకున్నాయి.

ఇక ఎన్నికల నేపథ్యంలో మళ్లీ అపరేషన్ అకర్ష్ కు తృణములు ఫదను పెట్టాలని యోచిస్తోంది. ఇంత‌టి కీల‌క ప‌రిస్థితుల్లో సీఎం విప్ల‌వ్ దేవ్‌ను త‌ప్పించి, బీజేపీ కొత్త రాజ‌కీయ ప‌రిణామానికి దారి తీసింది. అయితే.. శ‌నివారం సాయంత్ర‌మే బీజేపీ అధిష్ఠానం కొత్త సీఎంను ప్ర‌క‌టించ‌నుంది. అయితే మ‌రో వాద‌న కూడా ఉంది. డిప్యూటీ సీఎంగా కొన‌సాగుతున్న జిష్ణుదేవ్ వ‌ర్మ‌ను ఆప‌ద్ధ‌ర్మ సీఎంగా ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. అయితే ఈ వార్త‌ను బీజేపీ అధికారికంగా ధ్రువీక‌రించ‌డం లేదు.

మరోవైపు నూత‌న సీఎంగా ఎవ‌ర్ని ప్ర‌క‌టించాల‌న్న సందిగ్ధంలో బీజేపీ ప‌డిపోయింది. శ‌నివారం సాయంత్రం బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్షం భేటీ కానుంది. 2018 లో విప్ల‌వ్ దేవ్ త్రిపుర సీఎంగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న కార్య ప‌ద్ధ‌తి ఇత‌ర నేత‌ల‌కు, కార్యక‌ర్త‌లకు ఏమాత్రం న‌చ్చ‌డం లేదు. దీంతో బీజేపీలో ఓ ర‌క‌మైన ఉక్క‌పోత‌, తిరుగుబాటు ధోర‌ణి త‌యారైంది. అధిష్ఠానం కూడా విప్ల‌వ్ దేవ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ స‌మ‌యంలో విప్ల‌వ్ దేవ్ సీఎంగా కొన‌సాగితే ఇబ్బందలుకున్న బీజేపీ… సింపుల్‌గా ఆయ‌న్ను ప‌ద‌వి నుంచి త‌ప్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles