Couple married aboard Southwest Airlines flight from Dallas విమానంలో పెళ్లితో ఒక్కటైన ప్రేమికుల జంట..

Love is in the air wedding plans awry us couple marry aboard flight

American couple gets married on flight, In-flight wedding, couple gets married on Southwest Airlines, American couple, Pam Patterson, Jeremy Salda, married on flight, In-flight wedding, Southwest Airlines, Oklahoma City, On board Marriage

US-based Southwest Airlines shared an interesting ‘incident’ that they had the privilege of hosting – a wedding ceremony aboard one of their flights. The rare choice of nuptial venue happened after Oklahoma City residents Pam Patterson and Jeremy Salda were forced to change their actual wedding plans at the last minute when their flight to Las Vegas got cancelled.

ITEMVIDEOS: పైలట్ అనుమతితో విమానంలో పెళ్లి.. ఒక్కటైన ప్రేమికుల జంట..

Posted: 05/03/2022 05:45 PM IST
Love is in the air wedding plans awry us couple marry aboard flight

ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కుటుంబాలను కూడా ఒప్పించారు. ఊళ్లో పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్నారు. పెళ్లి మండపానికి వెళ్లడానికి విమానం టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కానీ ఆ విమానం ఆలస్యమైంది. ఏం చేయాలో తెలియన పరిస్థితిలో ఉన్నారు ఇద్దరు. చివరకు వాతావరణం బాగలేని కారణంగా క్యాన్సిల్ అయింది. ఏంట్రా ఈ ఖర్మ.. పెళ్లి చేసుకుని ఒక్కటి కావాలనుకున్న తమకు ఎందుకీ అవాంతరాలు ఏర్పడుతున్నాయి.. దేవుడా అంటూ ప్రార్థించారు ప్రేమికులు జెరెమీ సాల్డా, పామ్ ప్యాటర్‌సన్.

వీళ్లిద్దరూ అమెరికాలోని ఓక్లహామాకు చెందిన వాళ్లు. విమానం క్యాన్సిల్ అవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి జారుకుని హైరానా పడుతున్నారు. అయితే దేవుడ్ని నిండు మనస్సుతో ప్రార్థించగానే నిజంగా దేవుడు పంపించినట్టే వచ్చాడు ఒక వ్యక్తి అతనే క్రిస్. ప్రేమికుల జంటతోపాటు క్రిస్ కూడా క్యాన్సిల్ అయిన విమానం ఎక్కాల్సి ఉంది. విమానం క్యాన్సిల్ వార్త విని టెన్షన్ పడుతున్న జంట పెళ్లి దుస్తుల్లో ఉండటం చూసి ఏమైందని అడిగాడు. వాళ్ల సమస్య విన్న అతను తనకు పెళ్లి చేపించే అర్హత ఉందని, కావాలంటే సాయం చేస్తానని చెప్పాడు.

అదృష్టం కలిసొచ్చి ముగ్గురికీ ఒకే విమానంలో సీట్లు దొరికాయి. అయితే ఆ విమానం సిటీకి మరో చివర ఉంది. దాంతో ఉబెర్ టాక్సీ బుక్ చేసుకొని వేగంగా అక్కడకు చేరుకున్నారు. అయితే తాము ప్రయాణించాల్సిన విమానం రెడీగా ఉంది. దీంతో ఈ ముగ్గురు కలసి విమానం ఎక్కారు. అయితే ముహూర్త సమయం మించిపోతుందని అలోచించిన పామ్.. విమానంలోని ఫ్లైట్ అటెండెంట్ జూలీ రేనాల్డ్స్‌కు తమ సమస్య చెప్పింది. విమానంలోనే సరైన ముహూర్తానికి తాము పెళ్లి చేసుకుంటామని తన అభిమతం చెప్పింది. దీనికి తోడు తమ వద్ద పెళ్లి జరిపించడానికి చర్చిలో అనుమతి పొందిన క్రిస్ ఉన్నట్లు కూడా చెప్పింది.

తమ నిండు నూరేళ్ల ఆశ.. కొత్త జీవితం ప్రారంభానికి చేయాల్సిన అంకురార్పణ విమానంలోనే చేద్దామని.. అందుకు కొంచెం సహకరిస్తే చాలునని పామ్ చెప్పింది. ఇదే విషయాన్ని పైలట్‌కు చెప్పగానే అతను ‘‘ఓకే.. తప్పకుండా చేద్దాం’’ అన్నాడు. అంతే విమానం గాల్లోకి లేచిన తర్వాత 37 వేల అడుగుల ఎత్తులో పామ్, జెరెమీ సాల్డా ఇద్దరూ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. విమానం ల్యాండ్ అయ్యాక అందరూ కలిసి ఫొటో దిగారు. అదే విమానంలో ఉన్న ఒక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ ఈ పెళ్లి ఫొటోలు కూడా తీశాడు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles