Grand Welcome to Pawan Kalyan on West Godavari Visit పశ్చిమ పర్యటనలో పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం..

Grand welcome to janasena chief pawan kalyan on west godavari visit

janasena rythu bharosa yatra, pawan kalyan rythu bharosa yatra, janasena koulu rythu bharosa yatra, janasena party, pawan, Pawan Kalyan kalaparru, kalaparru tollgate, Pawan Kalyan Gaint Garland, Janasena Koulu Rythu Bharosa Yatra In West Godavai, West Godavai. Andhra Pradesh, Politics

The Janasena party launched a Rythu Bharosa Yatra in West Godavari district in consultation with the families of farmers who have committed suicide and provided them financial assistance on behalf of the Janasena. Power star and Janasena chief Pawan Kalyan, who reached Vijayawada Gannavaram Airport, left Gannavaram for West Godavari district by road. On the borders of West Godavari district, Pawan Kalyan received a warm welcome from the masses as well as local activists and fans.

పశ్చిమ పర్యటనలో పవన్ కు ఘనస్వాగతం.. రైతు భరోసా యాత్రలో వేలాది జనం..

Posted: 04/23/2022 05:49 PM IST
Grand welcome to janasena chief pawan kalyan on west godavari visit

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి వారికి జనసేన తరపున ఆర్ధిక సాయం అందించే రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో చేపట్టింది జనసేన పార్టీ. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పవర్ స్టార్, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా యాత్రకు బయలుదేరారు. పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుల్లో పవన్‌ కల్యాణ్ కు జనసైనికులతో పాటు స్థానిక కార్యకర్తలు, అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది.

పవన్ కల్యాణ్ తమ జిల్లాకు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూసిన అభిమానులకు ఆశలు నెరవేరడంతో వారు క్రేస్ సాయంతో ఆయన వస్తున్న కారుపై భారీ గజమాలను వేసి సత్కరించారు అభిమానులు. కలపర్రు మీదుగా తొలుత పెదవేగి మండలం జానంపేటలో రైతు కుటుంబానికి పవన్ కళ్యాణ్‌ లక్ష రూపాయల చెక్కు అందించారు. పశ్చిమ గోదావరి యాత్రలో పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రలో భాగంగా 41 మందికి సహాయం అందించనున్నారు. జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర కోసం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అడుగుపెట్టిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు ఆ పార్టీ నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

ఏలూరు శివారులో ఉన్న కలపర్రు టోల్ గేట్ వద్దకు వేల సంఖ్యలో జనసైనికులు తరలి వచ్చారు. పశ్చిమ గోదావరి యాత్రకు వచ్చిన పవన్‌ను భారీ గజమాలతో సత్కరించారు. కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ జానంపేట వైపు కదిలారు. జానంపేటలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లికార్జున రావు కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. దెందులూరు నియోజకవర్గం జానంపేట గ్రామంలో తొలి చెక్కు అందచేశారు. బాధిత కుటుంబానికి లక్షరుపాయల సాయంతోపాటు ఇద్దరు ఆడ బిడ్డల భవిష్యత్తుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్‌తో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత ధర్మాజీగూడెంలో కౌలు రైతు దాసరి రాజారావు కుటుంబానికి పవన్ కళ్యాణ్ లక్ష రుపాయల ఆర్ధిక సాయం అందించారు. చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీగూడెం ప్రాంతానికి చెందిన కౌలు రైతు రాజారావు ఆర్థిక ఇబ్బందులతో మూడేళ్ల క్రితం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నారు. జనసేన తరపున ఆ కుటుంబానికి సాయం అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles