తమ తమ పనుల్లో నిమగ్నమైన పోలీసులు అధికారులకు వచ్చిన ఆ ఒక్క ఫోన్ కాల్ వారిని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఆదేవరు చేశారు.? ఆ ఫోన్ కాల్ సారాంశమేంటీ అంటే.. ‘‘విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే రైళ్లలో బాంబు పెట్టాం’’ అంటూ ఓ అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్ కాల్ పోలీసులను అన్ని పనులు పక్కనబెట్టి యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకునేలా చేసింది. దీంతో సమాచారాన్ని ఓ వైపు పోలీసులు ఉన్నతాధికారులతో పంచుకోవడంతో పాటు అదే సమయంలో మరోకరు విశాఖపట్నం నుంచి బయలుదేరిన రైళ్ల సమాచారం. ప్రస్తుతం ఆయా రైళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నారు.
ఇదే సమయంలో మరోకరు బాంబ్ స్వాడ్, డాగ్ స్వాడ్ అధికారులకు కూడా సమాచారాన్ని చేరవేశారు. ఇక రంగంలోకి దిగిన లా అండ్ ఆర్డర్ పోలీసులు వచ్చిన ఫోన్ నెంబరు ఎవరిదీ.? అన్న సమాచారం రాబట్టే పనిలో వున్నారు. ఇక రైల్వే పోలీసులు నుంచి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ చేరుకుంటున్న రైళ్తను నిలిపి తనిఖీలు నిర్వహించారు. కాజీపేటలోని ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపి.. పోలీసులు సోదాలు నిర్వహించారు. రైలు బోగీల్లో జాగీలలతో తనిఖీలు చేపట్టారు.
పోలీసుల తనిఖీలు చూసి... రైళ్లలో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఏం అవుతుందో అని.. భయాందోళనకు గురై అయ్యారు. చివరకు పోలీసులు... అది ఫేక్ కాల్‌గా గుర్తించారు. రైళ్లను పంపించి ఎక్కడా ఎలాంటి ప్రమాదం జరగలేదని ఊపిరి పీల్చుకున్నారు. ఓ ఆగంతకుడు ఇవాళ ఉదయం పోలీసులు క్విక్ రెస్పాన్సివ్ నెంబర్ 100కు ఫోన్ చేసి.. విశాఖ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైళ్లలో బాంబు పెట్టామంటూ పోన్ చేసి చెప్పాడు. ఆగంతకుడి ఫోన్ కాల్‌తో రైల్వే రక్షక దళం పోలీసులు.. అప్రమత్తమై.. యుద్దప్రాతిపదికన రైళ్లను నిలిపి తనిఖీలు నిర్వహించి ఊపిరి పీల్చుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more