Hero Naga Chaitanya fined for tinted glass violation ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన మరో యంగ్ హీరో..

Tollywood hero naga chaitanya fined for tinted glass violation

Hyderabad traffic police, fine, Tollywood hero, Naga Chaitanya, violating traffic rule, tinted glass rule, traffic police imposed Rs 700 fine, traffic police removed black film, traffic police checks, Jubilee Hills Check Post, Tollywood celebrities, Junior NTR, Kalyan Ram, Allu Arjun, Manchu manoj, tinted glass rule, Telangana police, Crime

The Hyderabad traffic police imposed a fine on Tollywood actor Naga Chaitanya for violating the tinted glass rule. According to the reports, the traffic police imposed Rs 700 fine on the car on Monday and removed the black film from the screens of his car.

ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన మరో యంగ్ హీరో.. ఈ సారి ఆయన వంతు

Posted: 04/12/2022 11:11 AM IST
Tollywood hero naga chaitanya fined for tinted glass violation

టాలీవుడ్ హీరోలు వరుసగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వద్ద బుకవుతున్నారు. ఆర్ఆర్ఆర్ తో అఖిలభారతంలో అభిమానులను సంపాదించుకున్న తారక్, పుష్పాతో ప్రపంచ వ్యాప్తంగా తన డాన్స్ మూమ్ మెంట్స్, డైలాగ్స్ తో ప్రేక్షకాధారణ సంపాదించడంతో పాటు సెలబ్రిటీలను కూడా తన ట్రాక్ పట్టేలా చేసిన అల్లు అర్జున్, మంచు మనోజ్, కల్యాణ్ రామ్ సహా పలువురు హీరోలు ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో ట్రాఫిక్ పోలీసులకు చిక్కారు. ట్రాఫిక్స్ రూల్స్ అతిక్రమించారన్న నేపథ్యంలో వీరిపై పోలీసులు ఫైన్ కూడా విధించారు.

ఇక ఈ సారి లవ్ స్టోరీ చిత్రంలో చక్కటి హిట్ అందుకున్న నాగచైతన్య వంతు వచ్చింది. జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వద్ద కార్లను తనిఖీ చేస్తున్న పోలీసులు .. అటుగా వస్తున్న హీరో నాగచైతన్య కారును కూడా అపి.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించారని రూ.700 ఫైన్ వేశారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ అతికించిన కారణంగా నాగచైతన్య కారును అపిన పోలీసులు ఫైన్ విధించారు. దాంతో పాటు కారుకు వున్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు పక్కాగా అమలు చేసేందుకు పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో చెక్ పాయింట్లు పెట్టి తనిఖీలు చేస్తున్నారు.

దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన అదేశాల నేపథ్యంలో ‘వై’ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తులు తప్ప మరెవ్వరూ తమ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలోని పలు మార్గాల్లో చెక్ పాయింట్లు పెట్టి తనిఖీలు చేస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానం అదేశాలను అమలుపర్చేలా తనిఖీలు కోనసాగుతున్నాయి. కాగా ఈ నిబంధనలను తోసిరాజుతూ తమ కార్లకు బ్లాక్ ఫిల్మ్ వేయించిన కార్లపై ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. దీనికి తోడు కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను కూడా తొలగిస్తున్నారు. తాజాగా, నాగచైతన్య కారును కూడా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు అపి. జరిమానా విధించడంతో పాటు బ్లాక్ ఫిల్మ్ తొలగించారు. ఈ సమయంలో చైతన్య కారులోనే ఉన్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles