man returns home alive 24 hours after cremation అంత్యక్రియలు నిర్వహించిన మరుసటి రోజు ప్రత్యక్షమైన వ్యక్తి..

Tamil nadu man returns home alive 24 hours after relatives buried his body

man presumed dead, Moorthy, daily wage worker, Tirupur, harvest sugarcane, Karthi, phone call, bus stop Banagaladpur, real identity of the deceased, burial spot, Government doctors, postmortem, local Tasildar, Erode, Tamil Nadu, crime

A 55-year-old man, who was presumed to be dead and was buried by his relatives on Sunday evening, returned home alive on Monday evening. The incident took place at Banagaladpur near Erode. Moorthy, a daily wage worker, had gone to Tirupur a few days earlier to harvest sugarcane, reported the Times of India. His son, Karthi, got a phone call from a relative on Sunday morning, saying his father was found dead at a nearby bus stop.

అంత్యక్రియలు నిర్వహించిన మరుసటి రోజు ప్రత్యక్షమైన వ్యక్తి..

Posted: 04/06/2022 06:32 PM IST
Tamil nadu man returns home alive 24 hours after relatives buried his body

తమ తండ్రి మరణించాడన్న వార్త తెలియగానే అదే రోజున ఆయన మృతదేహాన్ని తీసుకుని వచ్చి అంత్యక్రియలు నిర్వహించాడు ఆయన కుమారుడు. ఆ మరుసటి రోజు తన తండ్రి మరణాన్ని తలుచుకుని విషాదంలో మునిగిపోయిన కుటుంబానికి పెద్ద షాక్ తగిలింది. అంత్యక్రియలు పూర్తి చేసిన 24 గంటల తర్వాత చనిపోయిన వ్యక్తి సజీవంగా ఇంటికొచ్చి కుటుంబసభ్యులకు తేరుకోలేని షాక్ ఇచ్చాడు. తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని బనగలద్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. ఈ విషయం తెలిసిన పోలీసులు మరణించిన వ్యక్తి అసలు వివరాలు ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 55 ఏళ్ల మూర్తి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. కాగా తిరుపూర్ లో పోలాల్లో చెరుకు పంట కోసేందుకు కొందరు దినసరి కూలీలతో కలసి కొన్ని రోజుల క్రితం వెళ్లాడు. కాగా, గత ఆదివారం సాయంత్రం మూర్తి కుమారుడు కార్తికి బంధువుల నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ వినగానే కుమారుడు కార్తి దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. ఫోన్ లో బంధువు మాట్లాడుతూ.. ‘‘ మీ నాన్న మూర్తి లాగానే ఉన్న ఓ వ్యక్తి ఇక్కడి సమీపంలోని బస్టాపులో శవమై కనిపించాడని చెప్పారు. దీంతో తల్లికి సమాచారం అందించిన కార్తికి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాడు. మృతదేహాన్ని చూసి అది తన తండ్రిదేనని నిర్ధారించాడు.

సత్యమంగళం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. అయితే మూర్తి మరణానికి గల కారణాలు ఏమీటన్నది దర్యాప్తు తరువాత చెబుతామని అన్నారు. ఇక మూర్తి కుటుంబసభ్యులు కోరడంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూడా తరలించకుండా కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు అదే రోజున (ఆదివారం రాత్రి) అంత్యక్రియలు నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేశారు. విషాదంలో మునిగిన మూర్తి భార్యను అమె బంధువులు ఓదార్చుతుండగా, అమె కుమారుడు కార్తి ఇంట్లో కూర్చోని బాధపడుతున్నారు.

కుటుంబ పెద్ద చనిపోయిన విషాదంలో మునిగిన కుటుంబ సభ్యులు.. సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చిన మూర్తిని చూసి నిర్ఘాంతపోయారు. తమ కళ్లను నమ్మలేకపోయారు. అతడి కుమారుడు కార్తి అయితే షాక్ నుంచి చాలా సేపటి వరకు తేరుకోలేకపోయాడు. తన తండ్రి మరణవార్త విని ఎంత షాక్ అయ్యానో, ఆయన ఇంటికి వచ్చినప్పుడు కూడా అంతే షాక్‌కు గురయ్యానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి తన తండ్రి బతికే ఉన్నారన్న సంతోషాన్ని పట్టలేకపోయిన కార్తి.. ఈ విషయాన్ని బందువులందరికీ చెప్పాడు. పనిలో పనిగా పోలీసులకు కూడా ఈ సమాచారాన్ని చేరవేశాడు.

కార్తి చేరవేసిన సమాచారంతో పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. కార్తీ ఇది తన తండ్రి మృతదేహమేనని గుర్తిపట్టిన నేపథ్యంలో ఎలాంటి పోస్టుమార్టం చేయకుండానే మృతదేహాన్ని అప్పగించారు. తీరా తన తండ్రి బతికి ఉన్నాడని చెప్పడంతో పోలీసులకు పని మరింత పెరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పరుగుపరుగు మృతదేహాన్ని ఖననం చేసిన స్థలానికి పరుగులు పెట్టారు. ఇద్దరు ప్రభుత్వ వైద్యులను పిలిపించి.. స్థానిక తహసీల్దార్ సహా రెవెన్యూ అధికారి సమక్షంలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. ఫోటోలు తీయించారు. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో తీయించిన తరువాత చనిపోయింది ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles