Burning cargo ship loaded with luxury cars drifts In Atlantic నౌకలో అగ్నిప్రమాదం.. వందల కోట్ల లగ్జరీ కార్లు బూడిద..

Felicity ace burning ship drifts in atlantic with lamborghinis porsches audis aboard

Felicity Ace, Volkswagen, Portugal, state of Rhode Island, Emden, Germany, US bond cargo ship, Rhode Island from Emden, cargo ship, 22 crew members, Germany to US, Portuguese Navy, the Azores islands

The Felicity Ace, a cargo ship carrying cars from Germany to the US, that caught on fire near Portugal earlier this week is still ablaze in the Atlantic Ocean. The ship is still loaded with thousands of cars that won't make it to their owners. The massive ship was evacuated by the Portuguese Navy saving all 22 crew members on board.

నడిసంద్రంలో కార్గోనౌకలో అగ్నిప్రమాదం.. వందల కోట్ల లగ్జరీ కార్లు బూడిద..

Posted: 02/18/2022 09:52 PM IST
Felicity ace burning ship drifts in atlantic with lamborghinis porsches audis aboard

ది ఫెలిసిటీ ఏస్ అనే భారీ రవాణా నౌక అగ్ని ప్రమాదానికి గురైంది. పనామాకు చెందిన ఈ నౌకలో అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లను ఇతర దేశాలకు తరలించేందుకు వస్తుండగా ప్రమాదం సంభవించింది. దీంతో లగ్జరీ కార్లన్నీ సముద్రంలో అగ్నిప్రమాదం దాటికి కాలిబూడిదయ్యాయి. అగ్నిప్రమాదం సంభవించడంతో నౌకలోని సిబ్బంది అంతా తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని సముద్రంలోకి దూకారు. ఈ ఓడలో లాంబోర్ఘిని, పోర్షే, ఆడి, ఫోక్స్ వాగన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల కార్లు ఉన్నాయి. ఈ ఓడ అట్లాంటిక్ మహాసముద్రంలో అజోరెస్ దీవుల వద్దకు వచ్చేసరికి అగ్నిప్రమాదానికి గురైంది.

సమీపంలోనే ఉన్న పోర్చుగీస్ నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఈ నౌకకు సంబంధించిన సమాచారాన్ని అందుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ది ఫెలిసిటీ ఏస్ ఓడలోని 22 మంది సిబ్బందిని సురక్షితంగా తరలించారు. అజోరెస్ దీవుల్లోని ఓ హోటల్ లో వారికి ఆశ్రయం ఏర్పాటు చేశారు. అయితే, కోట్లాది రూపాయల ఖరీదైన కార్లతో కూడిన ఆ ఓడ ఇప్పుడు నడిసముద్రంలో కొట్టుకుపోతోంది. ఆ నౌకలో ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. కాగా, ఈ ఓడలో ఒక్క ఫోక్స్ వాగన్ కంపెనీకి చెందినవే 3,965 కార్లు ఉన్నాయట. దాంతో జర్మనీలోని ఆ సంస్థ యాజమాన్యం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.

ఈ కార్గో ఓడ ప్రపంచవ్యాప్తంగా పలు రేవు పట్టణాలకు కార్లను చేర్చాల్సి ఉంది. లగ్జరీ కార్ల తయారీకి పెట్టిందిపేరైన పోర్షే సంస్థ కూడా ఈ పరిణామం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పోర్షే కంపెనీ కార్లు ఈ ఓడలో 1,100 ఉండడమే అందుకు కారణం. 2019లో గ్రాండే అమెరికా అనే నౌక కూడా ఇలాగే 2 వేల లగ్జరీ కార్లతో వెళుతూ సముద్రంలో మునిగిపోయింది. కాగా, ది ఫెలిసిటీ ఏస్ నౌక యజమాని ఈ ప్రమాదంపై వెంటనే అప్రమత్తమయ్యారు. మరో నౌక సాయంతో తమ నౌకను సురక్షితంగా తీరానికి చేర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles