Biker Has Close Shave With Rajdhani Express Train రెండు క్షణాలు.. బైక్ తునాతునకలు.. తప్పించుకున్న బైకర్..

Watch mumbai biker s close shave with train captured in dramatic video

Mumbai train, Narrow Escape, Narrow escape for motorcyclist, Rajdhani Express train, train smashed two-wheeler into pieces, biker seconds edge with death, biker close shave with death, close shave, two wheeler, mumbai, Viral video

A heart-stopping video has captured one motorcyclist's narrow escape from an oncoming train. Footage from Mumbai shows how the motorcyclist escaped with his life seconds before his vehicle was crushed by the train. It was a Rajdhani Express train that smashed the two-wheeler into smithereens on February 12.

ITEMVIDEOS: రెండు క్షణాలు.. బైక్ తునాతునకలు.. తప్పించుకున్న బైకర్..

Posted: 02/17/2022 12:54 PM IST
Watch mumbai biker s close shave with train captured in dramatic video

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్న నానుడి ఈ ప్రమాదాన్ని చూసినవారికి నిజమని బోధపడుతోంది. ఎందుకంటే కేవలం రెండు సెకన్ల వ్యవధిలో చావు నుంచి తప్పించుకున్న ఈ వాహనదారుడ్ని చూస్తే ఈ మాటలు నిజమనాల్సిందే. అయితే ఈ రెండు సెకన్ల వ్యవధిలోనే అతని వాహనం తునాతునకలైంది. ముక్కలైన అతని బైక్ లోని ఓ ముక్కే అతని కాళ్లకు తగలడంతో స్వల్ప గాయాలతో ఈ వాహనదారుడు పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రెండు క్షణాలకు ముందు తన ద్విచక్రవాహనంపై తిరిగిన ఆ యువకుడు.. రెండు సెకన్ల తరువాత బైక్ ముక్కలు కావడంతో పాదచారిగా మారిపోయాడు. అయితే చావును అత్యంత సమీపం నుంచి వీక్షించిన అనుభవం మాత్రం మిగిలింది.

రోజూ ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. అందులో రైలు ప్రమాదాలంటే మాత్రం కొంత అరుదుగానే చోటుచేసుకుంటాయి. చాలా వరకు రైలు ప్రమాదాలు రైల్వే స్టేషన్లలోనే సంభవిస్తుంటాయి. రైలు ఎక్కే, దిగే ప్రయాణికులు సకాలంలో ఎక్కడంలోనో, లేక దిగడంలోనో ఇబ్బందులు ఎదుర్కోని ప్రమాదపుటంచులకు చేరుతుంటారు. అయితే ఇలాంటి వాటిపై ఈ మధ్యకాలంలో అతిగా దృష్టిపెట్టిన రైల్వే భద్రతా సిబ్బంది ప్రయాణికులను ప్రమాదాల నుంచి కాపాడుతూ.. వారు ప్రమాదాల బారిన పడకుండా ఈ వీడియోలను సామాజిక మాద్యమాల్లోనూ పోస్టు చేసి జాగృత పరుస్తున్నారు.

అయితే రైల్వే ట్రాక్స్ క్రాసింగ్ల వద్ద అత్యంత అరుదుగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా రాజస్థాన్ లోని ఓ రైల్వేగేట్ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ట‌న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రాజస్థాన్ లోని కోటా ప్రాంతంలోగల ఓ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు వస్తుందని గేటు వేశారు. అయితే ఓ బైక‌ర్.. రైల్వే గేట్ వేసి ఉన్నా.. ఆవేశ‌ప‌డి.. రైల్వే క్రాసింగ్‌ గేటును దాటుకొని బైక్ మీద వెళ్తున్నాడు. ఇటువైపు నుంచి అటువైపుకు రమారమి వెళ్తుండగా, చివరి ట్రాక్ మాత్రమే మిగిలివుంది. అదే ట్రాకుపై ఓ వైపు నుంచి రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకొచ్చింది.

అప్పటి వరకు రైలును గమనించని వాహనదారుడు ఒక్కసారిగా రైలు దూసుకురావడాన్ని గమనించి.. తన బైక్ బ్రేక్ కిందపడేసి.. తాను పక్కకు తప్పుకున్నాడు. అయితే తన బైక్ రైలు పట్టాలపై పడకుండా లాగుదామని అనుకునే లోపు రైలు వచ్చి.. బైక్ ను ఢీకొ్ట్టింది. అందే బైక్ తునాతునకలు అయ్యింది. అందులోని ఓ భాగం అతని కాళ్లకు బలంగా తగిలి మళ్లీ రైలు పట్టాలపైకి వెళ్లింది. రైలు వేగం ధాటికి అది ముక్కలైంది. అయితే క్షణకాలంలో ప్రాణాలు పోయే ప‌రిస్థితిని ఎదుర్కోన్న బైకర్.. స్వల్ప గాయాల‌తో చావు నుంచి త‌ప్పించుకోవడం అదృష్టంగానే పేర్కోంటున్నారు ప్రత్యక్ష సాక్షులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles