Tragedy: 27 Year old Telugu Student Killed in U.S! విషాదం: అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Indian store clerk killed during robbery at talladega county gas station

sri satya krishna chitturi, satya krishna, krishna, store clerk, crown service station, Birmingham highway, Alabama, America, Vishakhapatnam, andhra pradesh, US, Crime

Sri Satya Krishna Chitturi, a 27-year-old youth from Andhra Pradesh, was killed during an armed robbery in the US on Thursday night. According to reports, Satya Krishna was working as a store clerk at Crown Service Station on the old Birmingham highway in Alabama. US police officials said Satya Krishna died on the spot in the armed attack.

అగ్రరాజ్యంలో దోపిడి దొంగల బీభత్సం.. తెలుగు యువకుడి దుర్మరణం

Posted: 02/12/2022 05:37 PM IST
Indian store clerk killed during robbery at talladega county gas station

అమెరికాలో దోపిడి దొంగల తుపాకీ కాల్పుల్లో తెలుగురాష్ట్రానికి చెందిన యువకుడు మరణించాడు. అగ్రరాజ్యంలో తుపాకీ సంస్కృతికి తోడు దొపిడీ దొంగలు హల్ చల్ చేస్తున్నారు. పట్టపగలే దుకాణాలు, మాల్స్ లోకి చోరబడి లూటీలు చేస్తున్నారు. అలబామలోని బిర్మింగ్‌హమ్‌లో ఫిబ్రవరి 11న జరిగిన కాల్పుల్లో ఓ తెలుగు యవకుడు ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నం సిటీకి చెందిన సత్యకృష్ణ చిట్టూరి (27) గతేడాది వివాహం అయ్యింది. భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది. అయితే అమెరికాలో ఉన్నత విద్య చదవాలనే లక్ష్యంతో గత నెల అప్పు చేసి మరీ అమెరికా చేరుకున్నాడు. అలబామ రాష్ట్రంలోని బిర్మింగ్‌హామ్‌ల్‌లో ఓ క్రౌన్‌ సర్వీస్‌ స్టేషన్‌ అనే స్టోర్‌లో క్లర్క్‌గా పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు.

ఫిబ్రవరి 11న సత్యకృష్ణ పని చేస్తున్న స్టోర్‌లో దోపిడికి దొంగలు యత్నించారు. ఆయుధాలు చేతబట్టి స్టోర్‌లోకి చొరబడ్డారు. అరడుగుల పొడవుతో నల్లని స్వెట్‌షర్ట్‌ ధరించిన దుండగుడు కాల్పులు జరిపాడు. బుల్లెట్లు నేరుగా తాకడంతో సత్యకృష్ణ అక్కడిక్కడే మరణించాడు. సత్యకృష్ణ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఫోటోలు రిలీజ్‌ చేశారు. కాల్పులు జరిపి సత్యకృష్ణ చావుకి కారణమైన దుండగుడి ఆచూకీ తెలిస్తే తెల్లడేగా కౌంటీ పోలీసులకు తెలపాలంటూ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles