AP police officers' body seeks apology from Minister వైరల్ అవుతున్న విశాఖ ఏఎస్సై వాయిస్ రికార్డ్.!

Ap police officers body seeks apology from minister who abused cop

Seediri Appalaraju, Animal Husbandry Minister, Andhra Pradesh Police Officers' Association, J Srinivasa Rao, Visakhapatnam, Sri Sarada Peetham, Andhra Pradesh, Politics

The Andhra Pradesh Police Officers' Association has demanded Chief Minister YS Jagan Mohan Reddy to take action against Animal Husbandry Minister Seediri Appalaraju for abusing and threatening a police officer during an event in Visakhapatnam on February 9. The Association has also sought a public apology from the Minister for using abusive language and behaving rudely with the officer.

‘‘పోలీసులంటే అంత లోకువా సార్..’’ వైరల్ అవుతున్న విశాఖ ఏఎస్సై వాయిస్ రికార్డ్.!

Posted: 02/11/2022 01:37 PM IST
Ap police officers body seeks apology from minister who abused cop

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ శారదా పీఠం సందర్శించిన సందర్భంగా రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు స్థానిక సీఐకి మధ్య నడిచిన తతంగం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంగం మంత్రి.. బేషరుతుగా తాను దుర్భాషలాడిన సర్కిల్ ఇనిస్పెక్టర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. శారదాపీఠం వద్ద అందులోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందర్శించిన క్రమంలో స్థానిక పోలీసులపై ప్రజలు చూస్తున్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయి సిఐపై దుర్భాషలాడటంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఆటంకం కలిగిస్తేనే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయబడతాయి. అలాంటిది చట్టాలను అమలుపర్చే అధికారిపైనే చట్టసభకు ఎన్నికైన శాసనసభ్యుడు, మంత్రి ఇలా నోటిదురుసును ప్రదర్శించడం, సీఐని చోక్కా విప్పి కోడతానని బెదిరించడం పోలీసులు అధికారులు క్షమాపణలు చెప్పేంతవరకు వెనక్కి తగ్గబోమని అంటున్నారు. ఇదే సందర్భంలో తమ ఉన్నాతాధికారిని ప్రజాప్రతినిధి దుర్భాషలాడడంపై విశాఖకు చెందిన ఓ మహిళా ఏఎస్సై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వాయిస్ రికార్డును విడుదల చేశారు.

‘సార్ నమస్తే’ అంటూ ప్రారంభించిన ఆ ఆడియోలో.. పోలీసులంటే అందరికీ లోకువేనా సర్? అని ప్రశ్నించారు. మీతో మాట్లాడాలన్నా తనకు ఏడుపు వస్తోందని అన్నారు. ప్రతిసారి పోలీసులను బూతులు తిట్టడమేనా? అని ప్రశ్నించారు. సీఎం ప్రొటోకాల్ ఎంతో కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. మా విధులు మేం నిర్వర్తించడం కూడా తప్పేనా? అని నిలదీశారు. ఓ ప్రభుత్వ ఉద్యోగిపై అలా తిరగబడడం కరెక్టేనా? అన్నారు. మీ బందోబస్తు కోసం ఉదయం నుంచే రోడ్లపై పడిగాపులు పడుతుంటామన్నారు. పై అధికారుల ఆదేశాలను పాటించడం కూడా తప్పేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంత రాజకీయ నాయకుడైతే మాత్రం పోలీసు ఉద్యోగిపై నోరు పారేసుకుంటారా? పోలీసు వ్యవస్థ మరీ ఇంతగా దిగజారిపోయిందా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గతంలో తొలిసారి శారదాపీఠానికి వచ్చినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం ఓ వ్యక్తిని లోపలకు పంపలేదని, అప్పుడు ఓ ఎంపీ వచ్చి ఎవడ్రా లోపలకు పంపలేదు? అన్నారని ఆమె గుర్తు చేశారు. ఇలా అనడం కరెక్టేనా? అన్నారు. అప్పుడు కూడా తాను చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. కష్టపడి శిక్షణ తీసుకుని రోడ్లపై ఉద్యోగాలు చేస్తుంటే ఎవడ్రా.. వాడు.. వీడు అంటారా? అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎండనక, వాననక కష్టపడి పనిచేస్తుంటే దుస్తులు ఊడిదీసి కొడతామంటారా? యూనిఫాంలో ఉన్న అధికారిని చేయి పట్టుకుని పక్కకు తోసేస్తారా? ఇది కరెక్టేనా? అన్నారు. ఇంకెవరైనా అయితే ఊరుకుంటారా? ఒకవేళ ఆ అధికారి తప్పుచేస్తే కమిషనర్‌కు ఫిర్యాదు చేయొచ్చని అన్నారు. సీఐని దుర్భాషలాడిన విషయం సీఎం దృష్టికి వెళ్లిందో, లేదో తనకు తెలియదని, ఒకసారి పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. లేదు, ఆయన చేసింది కరెక్టే అయితే వదిలేయాలని కోరారు. తాను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుంటే క్షమించాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles