TDP MLC Ashok babuarrested తప్పుడు దృవపత్రం కేసులో అశోక్ బాబు అరెస్టు.!

Tdp mlc ashok babu arrested in forgery of educational qualification case

TDP MLC Ashok Babu, AP CID officials, B.Com, Mehr Kumar, Assistant Commercial Officer, Lokayukta, Geeta Madhuri, Joint Commissioner of State Taxes, Special Chief Commercial Tax Officer, misinformation, tampered records, Andhra Pradesh, Politics

The TDP MLC Ashok Babu was arrested by AP CID officials on Friday morning. The officers who took Ashok Babu into custody have shifted him to the Guntur CID office and are investigating. CID officials said that Ashok Babu had given false information that he had qualified B.Com while he was working as an Assistant Commercial Officer.

తప్పుడు దృవపత్రం కేసులో అర్థరాత్రి ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టు.!

Posted: 02/11/2022 12:29 PM IST
Tdp mlc ashok babu arrested in forgery of educational qualification case

టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబును పోలీసులు గత రాత్రి అరెస్టు చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసిన సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించినట్టు వచ్చిన ఆరోపణలను ఎదుర్కోంటున్నారు. ఈ అరోపణల నేపథ్యంలో గత రాత్రి 11.30 గంటల సమయంలో సిఐడీ పోలీసులు అశోక్ బాబును అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అశోక్ బాబు డిగ్రీ విషయమై విజయవాడకు చెందిన మెహర్ కుమార్ గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. స్పందించిన లోకాయుక్త వాణిజ్య పన్నుల విభాగం నుంచి నివేదిక తెప్పించుకుని, దీనిపై విచారణ జరిపించాలని కోరింది.

ఉద్యోగ బాధ్యతల నుంచి ఉద్యోగ సంఘాల నేతగా అవతరించిన అశోక్ బాబు.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దీంతో ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు. అయితే రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ డి.గీతామాధురి ఇటీవల అశోక్ బాబుపై సీఐడీ అధికారులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐడీ పోలీసులు నిన్న అశోక్‌బాబు ఇంటి వద్ద మఫ్టీలో కాపుకాశారు. ఓ వివాహవేడుకకు హాజరైన అశోక్‌బాబు రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి రాగా, అప్పటికే అక్కడ కాపుకాసిన సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నేడు ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

మరోపక్క, ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై నిలదీస్తున్నందుకు ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టిందని, సర్వీస్ మేటర్స్‌లో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా అశోక్ బాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. అశోక్ బాబు అరెస్ట్‌ను కోర్టులోనే తేల్చుకుంటామని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles