దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా పెను ముఫ్పు ముంచుకోస్తోంది. ఇక ఈ విశృంఖల వ్యాప్తి సంక్రాంతి నాటికి మూడవ దశకు కారణం అవుతుందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రతీ ఒక్కరినీ ఈ వేరియంట్ ప్రభావితం చేస్తుందని కూడా వైద్యనిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో యూనైటెడ్ కింగ్ డమ్ కి చెందిన భారత సంతతికి శాస్త్రవేత్త రవీంద్ర గుప్తా మాత్రం.. ఒమిక్రాన్ వేరియంట్ పరిణామక్రమంలో తప్పిందం వల్ల ఉత్భవించిందని.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒమిక్రాన్ వేరియంట్ ప్రభలడం ద్వారా లక్షణాల తీవ్రత డెల్టాతో పోల్చితే తక్కువగా ఉన్నాయన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో ఇది కరోనా రూపాంతరం చెందే పరిణామక్రమంలో జరిగిన తప్పిదం వల్లే ‘తేలికపాటి వైరస్’గా ఉందని రవీంద్ర గుప్తా తెలిపారు. అయితే ఈ వేరియంట్ తరువాత రూపాంతరం చెందే మరిన్ని వేరియంట్లు మానవాళి మనుగడకు ప్రమాదకారిగా తయారుకావచ్చునన్న సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. యూనైటెడ్ కింగ్ డమ్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఒమిక్రాన్‌పై ఇటీవల పరిశోధన చేశారు.
శరీర రోగ నిరోధక వ్యవస్థకు ఈ రకం వైరస్ మరింత స్పష్టంగా కనిపించేందుకు కారణమవుతున్న కీలక యంత్రాంగాన్ని గుర్తించారు. ఊపిరితిత్తుల్లోని కణాల్లో ఒమిక్రాన్ తక్కువగా ఇన్ఫెక్షన్ కలిగిస్తున్నట్లు గుప్తా గమనించారు. అయితే కరోనా మహమ్మారి ఇప్పటికిప్పుడు తక్కువ ప్రమాదకరంగా రూపాంతరం చెందడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని అందుకు ఇది వేంగా వ్యాప్తి చేందడమే నిదర్శనమని చెప్పారు. అయినా ప్రస్తుతం అది ఈ విధంగా మారడానికి కారణం.. పరిణామక్రమంపరంగా జరిగిన తప్పిదమనే ఆయన అంచనా వేశారు. ఇక భవిష్యత్తులో మునుపటి వేరియంట్లు తరహాలోనే కొత్త వేరియంట్లు తీవ్ర లక్షణాలతో చెలరేగే అవకాశాలు వుండవచ్చునని గుప్తా పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 27 | బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 46 పోస్టుల భర్తీ... Read more
Jun 27 | అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు శనివారం జ్యుడిషీయల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. సాయి డిఫెన్స్ అకాడమీని... Read more
Jun 27 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ట్రబుల్ షూటర్‌గా పేరొందిన సేన ఎంపీ సంజయ్ రౌత్‌కు భూ కుంభకోణంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రవీణ రౌత్, పత్రా చావల్... Read more
Jun 27 | ఆర్మీలో నియామకాల కోసం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నూతనంగా అగ్నిఫథ్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయి నిరసనలు, అందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అగ్నిపథ్’ పథకానికి యువత నుంచి... Read more
Jun 27 | శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ భద్రత కల్పించడంపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో విరుకుపడింది. బీజేపి అసలు రంగు బయట పడిందంటూ దుయ్యబట్టింది. కేంద్రంలోని విపక్షనేతలకు ఉన్న భద్రతను తొలగించి..... Read more