India records second ‘Omicron death’ ఆ రాష్ట్రంలో ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని 141 మందికి ఒమిక్రాన్..

First omicron death in india as maharashtra man infected with variant dies

Coronavirus, Covid, Covid vaccine, First Omicron death in India, Omicron death in Maharashtra, first omicron death in pune, Covid vaccine registration, omicron, covid cases in india, omicron virus, corona cases in india, corona update, coronavirus india, omicron symptoms, covid cases in bangalore, corona update in india, lockdown news, coronavirus news, norovirus, karnataka news, india coronavirus, coronavirus in india, covid cases in india in last 24 hours today, omicron, Omicron variant, omicron variant covid, New variant Omicron, omicron virus, omicron virus symptoms, omicron virus variant, omicron virus india, omicron virus variant, Covid guidelines

A 73-year-old Covid-19 patient infected with Omicron variant died in Rajasthan's Udaipur. However a day later, his test report came negative. According to the Rajasthan government, the patient tested Covid positive on Dec 15 and genome sequencing showed Omicron present on Dec 25. He died on Dec 30 due to post-Covid pneumonia with comorbidity diabetes mellitus, hypertension and hypothyroidism.

ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని 141 మందికి ఒమిక్రాన్.. రెండో ఒమిక్రాన్ మరణం..

Posted: 12/31/2021 12:23 PM IST
First omicron death in india as maharashtra man infected with variant dies

దేశంలో నూతన సంవత్సరం వేడుకల వేళ.. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి మూడవ దశ ముపుతో విరుచుకుపడనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది సంక్రాంతి నుంచి మరింత వేగం పుంజుకుని ఫిబ్రవరి 3 నాటికి తీవ్రస్థాయికి చేరుతుందని కూడా ఐఐటీ కాన్పూర్ అంచనా వేసింది. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టాతో పోల్చితే దాదాపు 30 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని కూడా వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు విదేశాలకు వెళ్లి వచ్చిన వ్యక్తులకు మాత్రమే సోకిన ఈ కొత్త మహమ్మారి తాజాగా ఎలాంటి వీదేశీయానం లేనివారికి కూడా సోకింది.

దేశంలో ఒమిక్రాన్ కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ లలోనే ఈ కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ నేపథ్యంలో ఢిల్లీలో లెవల్ 2 దశ ఆంక్షలు అమలు చేస్తూ.. ఒమిక్రాన్ కట్టడికి చర్యలు చేపట్టారు. అయినా కేసులు మాత్రం పెరుగుతూనే వున్నాయి. ఇటు మ‌హారాష్ట్ర‌ను ఒమిక్రాన్ వేరియంట్ అత‌లాకుత‌లం చేస్తున్న‌ది. నిన్న‌టి వ‌ర‌కు ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే 450 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అయితే ఎలాంటి ట్రావెల్ హిస్ట‌రీ లేకున్నా.. 141 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు ముంబై ప్ర‌భుత్వ అధికారులు వెల్ల‌డించారు. 141 మందిలో 93 మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారున్నారు.

ఇందులో 21 మంది కేవ‌లం కే వెస్ట్ వార్డు నుంచి ఉన్నారు. అంధేరి వెస్ట్, జూహు, వేర్సోవా, డీ వార్డులో ఈ కేసులు న‌మోదు అయ్యాయి. నిన్న ముంబైలో 153 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధార‌ణ కాగా, ఇందులో 12 మంది మాత్ర‌మే ఇంట‌ర్నేష‌న‌ల్ ప్యాసింట‌ర్స్ ఉన్నారని బృహ‌ణ్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని ఒమిక్రాన్ కేసుల సంఖ్య 290కి చేరింది. మరోవైపు మహారాష్ట్రలో ఒమిక్రాన్  కేసులు రోజురోజకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 190 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 30 మంది విదేశాల నుంచి వచ్చిన వారునున్నారు. దీంతో మొత్తం మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 450కి చేరింది.

ఇక దేశవ్యాప్తంగా కరనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 309 కేసులు నమోదయ్యాయి, దీంతో దేశంలో మొత్తంగా 1270 కేసులు నమోదుకాగా, అందులో మహారాష్ట్రలోనే అత్యధికంగా 450 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 320 పాజటివ్‌ కేసులతో రెండో స్థానంలో ఉంది. కేరళలో 109, గుజరాత్‌లో 97, రాజస్థాన్‌లో 69, తెలంగాణలో 62, తమిళనాడులో 46, కర్ణాటకలో 34, ఆంధ్రప్రదేశ్ 16, హర్యానాలో 14, ఒడిశాలో 14, పశ్చిమ బెంగాల్ లో 11 కేసులు నమోదు కాగా.. మరో 11 రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

ఇదిలావుండగా దేశంలో రెండో ఒమిక్రాన్ మరణం కూడా నమోదైంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్లో ఓమిక్రాన్ వేరియంట్ సోకిన 72 ఏళ్ల వృద్దుడు మరణించాడు.మరణానంతరం ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షలో కరోనా నెగిటివ్ అని నివేదికలు నిర్థారించడం గమనార్హం. రాజస్థాన్ ప్రభుత్వం ప్రకారం, రోగి డిసెంబరు 15న కోవిడ్ పాజిటివ్‌గా పరీక్షించబడ్డాడు మరియు డిసెంబరు 25న ఒమిక్రాన్ ఉన్నట్లు జన్యుక్రమం చూపించింది. అతను డిసెంబరు 30న కొమొర్బిడిటీ డయాబెటిస్ మెల్లిటస్, హైపర్‌టెన్షన్ మరియు హైపోథైరాయిడిజంతో పోస్ట్-కోవిడ్ న్యుమోనియా కారణంగా మరణించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles