Mumbai Woman Fined ₹ 8 Lakh For Feeding Stray Dogs వీధి కుక్కులకు అహారం పెట్టినందుకు రూ.8 లక్షల జరిమానా.!

Shocking navi mumbai woman fined rs 8 lakh for feeding stray dogs

Feeding Stray Dogs, Housing Colony, Mumbai, Navi Mumbai Woman, NRI Complex, woman fined, Stray dogs, Crime

In a surprising incident, a woman living in a housing complex in Navi Mumbai has alleged that the management committee of her residential society has imposed a fine of over Rs 8 lakh on her for feeding stray dogs inside the premises, reported news agency PTI. The management committee of the NRI Complex, which comprises over 40 buildings, has imposed the fine.

వీధి కుక్కులకు అహారం పెట్టినందుకు రూ.8 లక్షల జరిమానా.!

Posted: 12/18/2021 12:08 PM IST
Shocking navi mumbai woman fined rs 8 lakh for feeding stray dogs

పుణ్యం చేయబోతే పాపం ఎదురైందని కూడా ఒ నానుడి వుంది. అచ్చం అలాగే జరిగిందీ ముంబైలోని ఓ మహిళకు. కరోనా సమయంలో అన్నం కూడా లభించిన వలస కూలీల గురించి కధలు కథలుగా విన్నాం. కానీ పాపం మూగ జీవాలు ఏమైపోతాయో అని కొందరు మాత్రమే ఆలోచించారు. అలాంటి వారిలో ఈ ముంబైకి చెందిన మహిళ ఒకరు. వీధి కుక్కలపై ఎంతో దయ చూపుతూ వాటికి ఆహారాన్ని అందించిందామె. అయితే అమె చేసిన మంచి పనికి స్థానికులు, ఇరుగుపోరుగువారు అభినందించాల్సింది పోయి.. అమెకు జరిమానా విధించారు. అది కూడా ఏకంగా లక్షల రూపాయాల్లో. దీంతో విస్తుపోయిన అమె జరిగింది ఏంటో తెలుసుకునే సరికి షాకింగ్ కుగురైంది.

నవీ ముంబయిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అన్నం పెట్టడం పుణ్యకార్యమే కానీ పాపకార్యం కాదు. కానీ మూగజీవాలకు అన్నం పెట్టిన ఈ మహిళకు మాత్రం అదే శాపంగా మారింది. ఏకంగా ఎనిమిది లక్షల రూపాయలను జరిమానాగా చెల్లించాలని అదేశించింది. ఓ ఎన్నారై గృహ సముదాయంలో నివసించే అన్షు సింగ్ అనే మహిళ రోజూ వీధి కుక్కలకు ఆహారం పెడుతోంది. ఆ గృహ సముదాయంలో 40 వరకు ఇళ్లు ఉన్నాయి. అయితే తమ హౌసింగ్ కాంప్లెక్స్ లో వీధి కుక్కలతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఇతరులు మేనేజింగ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ అన్షు సింగ్ పై తమ నిబంధనల మేరకు జరిమానా విధించింది.

ఆ హౌసింగ్ కాంప్లెక్స్ లో వీధికుక్కలకు ఆహారం వేస్తే రోజుకు రూ.5 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన అన్షు సింగ్ కు ఇప్పటివరకు విధించిన జరిమానాల మొత్తం రూ.8 లక్షలకు చేరింది. ఈ మొత్తాన్ని అమె నిర్దేశిత సమయంలోపు ఎన్నారై గృహ సముదాయం కాలనీ యాజమాన్యానికి చెల్లించాల్సి వుంటుంది. కాగా ఇదే కాంప్లెక్స్ లో నివసించే లీలా వర్మ అనే మహిళ మాట్లాడుతూ, కాంప్లెక్స్ లోపల వీధి కుక్కలకు ఆహారం పెట్టే వారి పేర్లను వాచ్ మన్ నమోదు చేసుకుంటాడని వెల్లడించారు. మరి వాచ్ మెన్ వీధి కుక్కలను ఎందుకు సముదంలోకి

ఈ ఘటనపై హౌసింగ్ కాంప్లెక్స్ కార్యదర్శి వినీత శ్రీనందన్ స్పందిస్తూ, తమ గృహ సముదాయం లోపల వీధి కుక్కలు యథేచ్ఛగా సంచరిస్తుండడంతో పిల్లలు ట్యూషన్లకు వెళ్లలేకపోతున్నారని, వృద్ధులు అసౌకర్యానికి గురవుతున్నారని వివరించారు. అంతేకాకుండా పార్కింగ్ ప్రదేశంలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ కుక్కలు అపరిశుభ్రతకు కారణమవుతున్నాయని, కాంప్లెక్స్ లోపల కుక్కలతో రణరంగంలా మారిందని పేర్కొన్నారు. దాంతో ఇక్కడ నివాసం ఉండేవారు సరిగా నిద్ర పోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోయారు. వీధి కుక్కల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నప్పటికీ, వాటికి బహిరంగ ప్రదేశాల్లో ఆహారం అందిస్తున్నారని వినీత ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Feeding Stray Dogs  Housing Colony  Mumbai  Navi Mumbai Woman  NRI Complex  woman fined  Stray dogs  Crime  

Other Articles