Two Women Maoists killed in Chhattisgarh చత్తీస్ గడ్ ఎన్ కౌంట‌ర్: ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

Two women naxals killed in encounter in chhattisgarh s dantewada

Maoists, Encounter, Maoist Party, Maoists, CRPF, Central Reserve Police Force, Maoist killed Dantewada, women naxals, naxals killed, encounter with naxals, Gonderas jungle, Dantewada DRG, Basta Bheema, police personnel, crude bomb explosion, Dantewada district, Chhattisgarh, Crime

Two women naxals were killed in an encounter with security forces near Gonderas jungle in the Dantewada district of Chhattisgarh on Saturday. The bodies of the two women naxals were recovered after the encounter. They collectively had a bounty of Rs 6 lakh on their heads.

చత్తీస్ గడ్ ఎన్ కౌంట‌ర్: ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

Posted: 12/18/2021 01:03 PM IST
Two women naxals killed in encounter in chhattisgarh s dantewada

మావోయిస్టులకు ఈ మధ్యకాలంటో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల జార్ఖంగ్ రాష్ట్రంలోని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు టెక్ రవి మరణించగా, మహారాష్ట్రలో ఎన్ కౌంటర్లో ఐదుగురు మావో లు మృత్యువాత పడ్డగా, ఇటు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోనూ నిషిద్ద మావోయిస్టు గ్రూపుకు చెందిన మిలీషియా టాప్ కమాండర్  హతమయ్యాడు. ఇక తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టు సభ్యులు మరణించారు.

పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. దంతెవాడ జిల్లా గోండెరాస్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఉన్నారన్న సమాచారంతో స్థానిక పోలీసులు గాలింపు చేపట్టారు. తమ కోసం అణువణువూ అన్వేషిస్తున్న పోలీసులు ఎదురుపడిన  క్రమంలో శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఇలా కాల్పులు జరిపి వారు ప్రతిదాడులకు సిద్దమయ్యే లోపు అక్కడి నుంచి తప్పించుకోవాలని పథకం వేశారు.

అయితే వెనువెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రతికాల్పులు జరపడంతో ఇద్దరు మహిళా మావోయిస్టులు చనిపోయారు. వారిని మల్లన్‌గఢ్‌ ఏరియా కమిటీ సభ్యురాలు హిద్మే కొహ్రామ్‌, సీఎఎం పొజ్జెగా గుర్తించారు. హిడ్మె తలపై రూ.5 లక్షలు, పొజ్జె తలపై రూ.లక్ష రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో మూడు నాటు తుపాకులు, యుద్ధ సామాగ్రి, కమ్యూనికేషన్‌ పరికరాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. తప్పించుకున్న నక్సలేట్లకోసం గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles