Gen. Bipin Rawat, wife and 11 others dead తమిళనాడు ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి..

Cds general bipin rawat wife madhulika among 13 dead as iaf mi 17v5 helicopter crash

military chopper crash live updates, helicopter crash live updates, bipin rawat chopper crash live, bipin rawat helicopter crash near coonoor, tamil nadu helicopter crash, CDS Gen Bipin Rawat, IAF chopper crash, rawat helicopter, rawat helicopter crash, cds gen bipin rawat, indian air force, rajnath singh, parliament, Coonoor, Tamil Nadu, Crime

Chief of Defence Staff, General Bipin Rawat, his wife and 11 others were killed in a helicopter crash near Coonoor on December 8, the Indian Air Force said. The copter carrying Gen. Rawat and his entourage crashed in apparently foggy conditions, killing the 13 people on board, the IAF and other officials said.

తమిళనాడు ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి

Posted: 12/08/2021 06:21 PM IST
Cds general bipin rawat wife madhulika among 13 dead as iaf mi 17v5 helicopter crash

తమిళనాడులో చోటుచేసుకన్న ఘోర ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై వెల్లింగ్టన్ అసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అందులో ఒకరు చీఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ ఉన్నారని తెలియడంతో దేశమంతా ఆయన క్షేమంగా బయటపడాలని కోరుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆయన కూడా ఈ ప్రమాదంలో మరణించారు. మొదట రావ‌త్ బ‌తికే ఉన్న‌ారని, ఆయనను అసుపత్రికి తీసుకెళ్లారని సమాచారం అందినా.. తీవ్రగాయాలపాలైన ఆయన అసుపత్రిలో చికిత్స పోందుతూ మరణించారన్న చేధువార్త అందింది.

ఇవాళ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల 41 నిమిషాల స‌మ‌యంలో బిపిన్‌రావ‌త్ స‌హా 14 మంది ప్ర‌యాణిస్తున్న హెలిక్యాప్ట‌ర్ చెట్టును ఢీకొట్టి కూలిపోయింది. త‌మిళ‌నాడులోని కూనూర్‌లో భార‌త వాయుసేనకు చెందిన ఎంఐ-17వీ5 హెలికాఫ్ట‌ర్ లో బయలుదేరిన త్రివిధ ద‌ళాధిప‌తి బిపిన్ రావ‌త్‌, ఆయ‌న భార్య మ‌ధూలిక రావ‌త్ మ‌రో 11 మంది మ‌ర‌ణించారు. వెల్లింగ్ట‌న్ (నీల‌గిరి హిల్స్‌)లోని డిఫెన్స్ స‌ర్వీస్ స్టాఫ్ కాలేజ్‌లో స్టాఫ్ కోర్స్ ఫ్యాక‌ల్టీ, స్టూడెంట్ ఆఫీస‌ర్ల‌ను ఉద్దేశించి ఉప‌న్యాసం ఇచ్చేందుకు రావ‌త్.. స‌లూర్ ఎయిర్‌బేస్ నుంచి హెలికాఫ్ట‌ర్‌లో వెళుతుండ‌గా ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఈ ఘ‌ట‌న‌లో బిపిన్ రావ‌త్ మర‌ణించార‌ని బుధ‌వారం సాయంత్రం ఐఏఎఫ్ ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన గ్రూప్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్ ప్ర‌స్తుతం వెల్లింగ్ట‌న్‌లోని మిల‌ట‌రీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని ఐఏఎఫ్ పేర్కొంది. కాగా ఆయనతో పాటు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన సతీమణి మధులిక కూడా ఈ ప్రమాదంలో మృత్యుఒడిలోకి జారుకున్నారు. మ‌రోవైపు సీడీఎస్ బిపిన్ రావ‌త్ మృతి, హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంపై ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల క్యాబినెట్ క‌మిటీ స‌మావేశ‌మైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles