Massive elephant rams safari truck off road అడవిలో పర్యాటిస్తున్న విద్యార్థులకు భయానక అనుభవం

Viral video massive elephant rams safari truck off road as tourists run for their lives

wildlife photographer, student tourists, Bone chilling experience, South Africa, SUV, Massive elephant, safari, south african safari, african elephant, mating season, elephant safari, elephant, attacks, truck, south africa, safari, animals, funny video, trending video, Viral video

This is the terrifying moment a six-ton elephant charges towards a safari truck and lifts it off the ground. Footage shows the 13ft creature piercing the front of the vehicle with its tusks, forcing the guide sat up front to jump out. The bull elephant came close to rolling the 11-seater truck over, but broke off just in time for the eco-students on board to escape.

ITEMVIDEOS: అడవిలో పర్యాటిస్తున్న విద్యార్థులకు భయానక అనుభవం

Posted: 12/02/2021 07:52 PM IST
Viral video massive elephant rams safari truck off road as tourists run for their lives

అడవిలో వన్యప్రాణులను నేరుగా చూసేందుకు ఆ అనుభవాన్ని తమ మిత్రులకు, భావితరాలతో పంచుకునేందుకు ఉత్సాహపడే వారు అడవుల్లోకి, సాంచురీల్లోకి వెళ్లి.. అక్కడి వన్యమృగాలను, క్రూర మృగాలను వీక్షిస్తుంటారు. అయితే ఇలా అడవుల్లోకి ఏ సమయంలో పడితే ఆ సమయంలో వెళ్లకూడదని అటవీశాఖ అధికారులతో పాటు.. పెద్దలు కూడా చెబుతుంటారు. దానికంటూ ఓ ప్రత్యేకమైన సమయాలు వుంటాయని కూడా చెబుతారు. ఏ సమయాల్లో అడవుల్లోకి వెళ్లాలి అనే కన్నా.. ఏ సమయాల్లో అడవుల్లోకి వెళ్లకూడదో పెద్దలు చెబుతారు.

అడవుల్లో మరీ ముఖ్యంగా వన్యప్రాణులు జతసాంగత్యం కోరే సమయాల్లో అటుగా వెళ్లరాదని అటవీ శాఖ అధికారులు చెబుతారు. ఎందుకంటే అవి సాంగత్యం కోరే సమయంలో చాలా విసుగుచెంది వుంటాయని.. ఆ సమయాల్లో అడవుల్లోకి వెళ్తే అవి దాడి చేస్తాయని పలు సందర్భాలలో ఇలా వెళ్లినవారు కొందరు మృత్యువాత పడగా, మరికోందరు బతుకు జీవుడా అంటూ గాయాలపాలై బయటపడ్డారని అటవీ అధికారులు చెప్పారు. అయితే ఇలా అడవుల్లోకి వన్యప్రాణులను వీక్షించేందుకు వెళ్లే సమయాలను తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని కూడా వారుచెబుతారు.

ఇలా వన్యప్రాణులను వీక్షించేందుకు ఫారెస్ట్ రిజర్వ్ కి వెళ్లిన విద్యార్థుల బృందానికి చేదు అనుభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా లింపోపోలోని సెలటి గేమ్ రిజర్వ్ కి కొందరు విద్యార్థులు వెళ్లగా వారిపై భారీ ఏనుగు దాడి చేసింది. సాంగత్యం కోసం ఒకచోటకు చేరుకున్న ఏనుగుల గుంపుకు చేరువగా వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. అయితే అదేసమయంలో మరోవైపు నుంచి ఒక్కసారిగా వారి వాహనం ముందు ప్రత్యక్షమైన భారీ ఏనుగు వారు ప్రయాణిస్తున్న సఫారీ వాహనాన్ని ధ్వంసం చేసింది. దాడి సమయంలో ఏనుగు నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులు పరుగులు తీశారు. తమ వస్తువులను ఎక్కడిక్కడ వదిలేసి మరీ తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles