maoist leader tech ravi dies in jharkhand మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు టెక్ రవి మృతి

4 maoists killed in encounter in maharashtra s gadchiroli forest police

Maoists, Gadchiroli forest, Encounter, police personnel, Dhanora, Gyarahbatti forest area, Maharashtra, Jharkhand, Maoist Party, Maoists, Tech Ravi, Maoist Ravi, Maoist Tech Ravi, Maoist central committe member, crude bomb explosion, Crime

At least four Maoists were killed in an encounter with the police on Saturday in Gadchiroli district of Maharashtra, a senior official said. The gun battle took place this morning at Dhanora in the Gyarahbatti forest area in the district, located over 920 km away from Mumbai, when a police team was conducting a search operation, he said.

మ‌హారాష్ట్ర‌ ఎన్ కౌంట‌ర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి.. టెక్ రవి కూడా..

Posted: 11/13/2021 02:53 PM IST
4 maoists killed in encounter in maharashtra s gadchiroli forest police

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖంగ్ రాష్ట్రంలోని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు టెక్ రవి మరణించగా, ఇటు మహారాష్ట్రలోనూ పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. కేంద్ర కమిటీ సభ్యుడు, డివిజినల్ కమిటీ స్థాయి నాయకుడు రవి అలియాస్ టెక్ రవి అలియాస్ జైలాల్ మృతి వార్తని పార్టీ ఆలస్యంగా ప్రకటించింది. నెల్లూరు జిల్లాకు చెందిన రవి మావోయిస్టు పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరించాడు. 2014లో రవి జార్ఖండ్‌కు వెళ్లి అక్కడే ఉంటూ ఆ పార్టీ గెరిల్లా ఆర్మీలో కీలక బాధ్యతలు నిర్వహించాడు.

గత ఏడాది జూన్ 25న మరణించిన టెక్ రవి విషయాన్ని మావోయిస్టు పార్టీ ఇవాళ అధికారింగా ప్రకటించింది. దాదాపు ఏడాదిన్నర కాలం తరువాత రవి వార్తను వెలువరించి పార్టీ. అయితే ఆయన ఎలా మరణించాడన్న విషయాన్ని కూడా మావోయిస్టు పార్టీ బహిర్గతం చేసింది. జార్ఖండ్ లోని కోల్హాన్ అటవీ ప్రాంతంలో గెరిల్లా ఆర్మీ ఎత్తుగడల క్యాంపైన్ లో భాగంగా గత ఏడాది జూన్ 25వ తేదీన బాణం బాంబు పరిశీలించాడు. కాగా ప్రమాదవశాత్తు ఆ బాణం బాంబు విస్పోటనం చెందడంతో తీవ్రంగా గాయపడి రవి మృతిచెందాడు. ఆ మరుసటి రోజే విప్లవ లాంఛ‌నాలతో రవి అంత్యక్రియలు నిర్వహించినట్లు మావోయిస్టు పార్టీ కేంద్రం కమిటి నాయకులు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు నాయకుడి మృతిని ఏడాదిన్నర ఆలస్యంగా ఆ పార్టీ అధికారికంగా ప్రకటించడం గమనార్హం.

ఇదిలావుండగా, మ‌హారాష్ట్ర‌లోని గ‌డ్చిరోలి జిల్లాలో ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులకు, మావోయిస్టులకు భీక‌ర‌మైన ఎదురుకాల్పులు చోటు చేసుకోవడడంతో ఐదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. శ‌నివారం ఉద‌యం గ్యార‌ప‌ట్టి అట‌వీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వ‌హిస్తోన్న పోలీసు బ‌ల‌గాల‌కు, మావోయిస్టులు తార‌స‌ప‌డ్డారు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్ర‌స్తుతం మావోయిస్టుల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. గ్యార‌ప‌ట్టి అట‌వీ ప్రాంతాన్ని పోలీసులు త‌మ ఆధీనంలోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles