"Can't Be Unending Story...": SC Raps UP ‘‘ఒడవని కథలా ఉండోద్దు..’’: లఖీంపూర్‌ హింసాకాండపై సుప్రీంకోర్టు

Lakhimpur kheri case investigations cannot be an unending story sc tells up govt

CJI, Justice NV Ramana, Supreme Court, Lakhimpur Farmers Killing, lakhimpur kheri violence, lakhimpur kheri violence case, lakhimpur kheri, farmers protest, ashish mishra, ajay mishra, Uttar pradesh, Crime

The Uttar Pradesh government faced tough questions today from the Supreme Court on the killing of farmers at a protest in Lakhimpur Kheri earlier this month and was told sternly to "dispel the feeling that you are dragging your feet". Ordering the UP government to protect and record the statement of all witnesses, the Supreme Court also admonished, "This should not be an unending story".

‘‘ఒడవని కథలా ఉండోద్దు..’’: లఖీంపూర్‌ హింసాకాండపై సుప్రీంకోర్టు

Posted: 10/20/2021 08:11 PM IST
Lakhimpur kheri case investigations cannot be an unending story sc tells up govt

దేశంలో కలకలం రేపిన లఖీపూర్‌ ఖేరి హింసపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది మరణించారు. అక్టోబరు 3న జరిగిన ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. సిట్‌ నివేదిక సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం కోరింది. యూపీ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఈ నివేదికను సమర్పించేందుకు శుక్రవారం వరకూ గడువు కోరారు.

ఘటన జరిగి పక్షం రోజులు దాటిన తరువాత కూడా సిట్ ఇంకా నివేదికను రూపోందిస్తుందా.? అని ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం యూపీ అడ్వకేట్ జనరల్ గడువు వినతిని అంగీకరించలేదు. దీంతో ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వ నివేదికను సాల్వే న్యాయస్థానానికి సమర్పించారు. అయితే నివేదికను నిన్న సమర్పిస్తారని అర్థరాత్రి వరకు వేచిచూశారని అయినా సమర్పించలేదని, ఇవాళ విచారణకు ముందు నివేదికనను సమర్పించడమేంటని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. సీల్డు కవరులో వచ్చిన రిపోర్టులో కేవలం నలుగురు సాక్షుల వాంగ్మూలాలే ఉన్న విషయాన్ని కూడా సీజేఐ ఎత్తిచూపారు. ఈ ఘటనలపై 40 మంది సాక్షులు వున్నారని కేవలం నలుగురి వాంగ్మూలాలనే పోందపర్చడం ఏంటిని ప్రశ్నించారు. ‘‘సాక్షుల్లో ఎవరికి బెదిరింపులు, హాని కలిగే ప్రమాదం ఉందో మీ సిట్‌ గుర్తించగలదు. అలాంటప్పుడు కేవలం నలుగురు సాక్షుల వాంగ్మూలాలే ఎందుకు తీసుకున్నారు?‘‘ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఈ క్రమంలో సాక్షులకు రక్షణ కల్పిస్తామని యూపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ కేసులో దర్యాప్తు ముగింపు లేని కథలా మిగలకూడదని, పోలీసుల దర్యాప్తు నత్త నడకన సాగుతోందనే అనుమానాలను ప్రభుత్వమే చెరిపివేయాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. మిగతా సాక్షుల వాంగ్మూలాలు కూడా సేకరించడం కోసం యూపీ ప్రభుత్వం సమయం అడగడంతో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అక్టోబరు 26లోపు తదుపరి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles