RPF constable saves pregnant woman falling from train నిండు గర్భిణి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్..

Cop s swift action saves pregnant woman who fell from train near mumbai

Railway Protection Force (RPF), Pregnant woman saved, Kalyan Railway Station, Mumbai, Pregnant Woman, S R Khandekar, pregnant woman Vandana, husband Chandresh, Gorakhpur from Kalyan, different train, de-board a moving train, CCTV footage, RPF Police, Maharashtra, crime

Kannada television actor Soujanya allegedly died by suicide in her apartment in Kumbalgodu in Bengaluru. According to city police, Soujanya’s body was found at her apartment on September 30th, amid the suspicions the autopsy report clarifies that the actress had committed suicide, the Police said.

ITEMVIDEOS: కదులుతున్న రైల్లోంచి దిగిన నిండు గర్భిణి.. కాపాడిన కానిస్టేబుల్..

Posted: 10/19/2021 03:34 PM IST
Cop s swift action saves pregnant woman who fell from train near mumbai

ఓ రైల్వే సీనియర్ కానిస్టేబుల్ అప్రమత్త నిండుప్రాణాన్ని కాపాడింది. ఒక్క ప్రాణం కాదు రెండు ప్రాణాలను కాపాడింది. దీంతో ఆయనపై నెటిజనుల ప్ర‌శంస‌ల వర్షం కురుస్తోంది. ఒకేసారి ఆయన రెండు ప్రాణాలను కాపాడారా.. అదెలా అంటారా..? ఆయన కాపాడింది నిండు గర్భిణి ప్రాణాలను కాబట్టి. అమె ప్రాణాలతో పాటు అమె కడుపులోని ఎనమిది నెలల బిడ్డ ప్రాణాలను కూడా ఆయన కాపాడారు. ముంబైలోని క‌ల్యాణ్ రైల్వే స్టేష‌న్ లో క‌దులుతున్న రైల్లో నుంచి కిందకు దిగుతున్న నిండు గ‌ర్భిణి ప్రయత్నించగా, అమె చేయి పట్టకుని ఫ్లాట్ ఫామ్ పైకి లాగాడు.

రైలు కదులుతున్న సమయంలో కింద‌కు దిగేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. అక్క‌డే ఉన్న రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ కానిస్టేబుల్ ఖండేకర్ అప్ర‌మ‌త్త‌మ‌య్యాడు. త‌క్ష‌ణ‌మే ఆమె చేయి ప‌ట్టుకుని ప్లాట్ ఫాంపైకి లాగాడు. సురక్షితంగా అమెను కిందకు దింపే ప్రయత్నంలో అమె నేరుగా అతడిపైనే పడింది. దీంతో ఇద్దరూ బ్యాలెన్స్ తప్పి కిందపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు గర్భిణిని చేయిపట్టుకుని మరింత బయటకు లాగేందుకు ప్రయత్నించారు. దీంతో గర్భిణి మహిళ కిందపడినా ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడింది.

కాగా కానిస్టేబుల్ అప్ర‌మ‌త్తమై అమెను లాగకపోయి ఉంటే పెను ప్రమాదం సంభవించేది. గ‌ర్భిణి మహిళ రైలు ప‌ట్టాల‌కు, ప్లాట్ ఫాం మ‌ధ్య‌లో ప‌డిపోయే ప్రాణాలు కోల్పోయే అవ‌కాశం ఉండేది. కానీ కానిస్టేబుల్ ఆమె ప్రాణాల‌ను కాపాడాడు. వివరాల్లోకి వెళ్లే వందన అనే గర్భిణి మహిళ తన భర్త చంద్రేశ్ తో కలసి కల్యాణ్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అక్కడి నుంచి వారు గోరఖ్ పూర్ వెళ్లే రైలు ఎక్కాలి. అందుకు బదులు వేరే రైలు ఎక్కారు. తీరా రైలు కదులుతున్న సమయానికి అది గోరఖ్ పూర్ రైలు కాదని తెలియడంతో వారు రైలు దిగే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అమె ప్రాణాలును అర్పీఎఫ్ కానిస్టేబుల్‌ ఖండేకర్ కాపాడాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles