BJP MLA awarded 5-year jail in fake marksheet case బీజేపి ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు..!

Bjp mla from ayodhya gets 5 years in jail in 28 year old fake mark sheet case

jail term awarded to Indra Pratap Tiwari, jail term awarded to BJP MLA, jail term awarded to Gosaiganj MLA, 5 year sentence to BJP MLA, Indra pratap tiwari sentenced for 5 years, jail sentence to BJP MLA, Indra Pratap Tiwari, BJP MLA, Gosaiganj MLA, Yaduvansh Ram Tripathi, 5 year sentence, Ayodhya, BJP, Fake Marks Sheet case, Uttar Pradesh, Crime

Indra Pratap Tiwari, BJP MLA from Gosaiganj in Ayodhya, was on Monday sentenced to five years imprisonment by a special court in a 28-year-old case of using a fake mark sheet to get admission in college. Special judge Puja Singh delivered the verdict and Tiwari, who was present in the MP/MLA court, was taken into custody and sent to jail. The court also slapped a fine of Rs 8,000 on him.

బీజేపి ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు.. రూ.8000 వేల జరిమానా.!

Posted: 10/19/2021 01:48 PM IST
Bjp mla from ayodhya gets 5 years in jail in 28 year old fake mark sheet case

నకిలీ మార్కుల షీట్ (మెమో) సమర్పించిన కేసులో బీజేపి ఎమ్మెల్యేకు ఐదేళ్ల కారాగార శిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఈ కేసులో శిక్షతో పాటు ఆయనకు రూ.8వేలను జరిమానాగా విధిస్తూ తీర్పును వెలువరించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య ప్రాంతానికి చెందిన గోసాయ్ గంజ్ ఎమ్మెల్యే ఇంద్రప్రతాప్ తివారీ అలియాస్ కబ్బు తివారీకి 28 ఏళ్ల పాత కేసులో ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి పూజా సింగ్ ఈ మేరకు తీర్పును వెలువరించగా, న్యాయస్థానానికి హాజరైన ఎమ్మెల్యేను పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకున్నారు.

1992 లో తివారీపై నకిలీ మార్కుల మెమోపై కేసు నమోదైంది. అయోధ్యలోని సాకేత్ డిగ్రీ కళాశాలలో చదువుకున్న ఆయన తన గ్రాడ్యూయేషన్ రెండవ సంవత్సరం పరీక్షలలో ఫెయిల్ అయ్యారు. అయితే తన చదవును కొనసాగించేందుకు ఆయన తన ఫెయిల్ అయిన సర్టిఫికేట్లకు బదులుగా తాను ఉత్తీర్ణత సాధించినట్టు ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించి మూడవ సంవత్సరం చదివేందుకు ప్రయత్నించారు. కాగా ఆయన సమర్పించినది నకిలీ సర్టిఫికేట్ అని గ్రహించిన కాళాశాల ప్రిన్సిపాల్ యదువంశ్ రామ్ త్రిపాఠి.. రామ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఎన్నో మలుపులు తీసుకున్న ఈ కేసులో పోలీసులు కూడా ఏకంగా 13 సంవత్సరాల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఈ కేసుకు సంబంధించిన అనేక ఒరిజినల్ సర్టిఫికేట్లు రికార్డుల నుంచి అదృశ్యమయ్యాయి. దీంతో కేసును జిరాక్స్ కాఫీలతో విచారణ చేయాల్సి వచ్చింది. దీంతో ఈ కేసులో తీర్పు వెలువడేందుకు ఏకంగా 28 సంవత్సరాలు పట్టింది. ఈ కాలక్రమంలో కేసును నమోదు చేసిన ప్రిన్సిపాల్ యదువంశ్ రామ్ త్రిపాఠి కూడా మరణించారు. దీంతో అప్పటి సాకేత్ కళాశాల డీన్ మహేంద్ర కుమార్ అగర్వాల్, ఇతర సాక్షులు తివారీకి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles