women protest against LPG cylinder price hike పండుగ వేళ.. కేంద్రంపై తిరగబడ్డ తెలంగాణ మహిళ..

Telangana women unique protest against centre play bathukamma with lpg cylinders

Telangana women, women protest, Central governent, Oil companies, unique festive style, LPG gas cylinders, bathukamma, BJP Govt, cylinder price hike, union government, Womens protest, LPG gas price hike, Telangana, video viral, Trending

Telangana women protest against Central governent and Oil companies in a unique festive style. In the video going viral online few woman in Telangana seen playing bathukamma with LPG cylinders.

ITEMVIDEOS: పండుగ వేళ.. కేంద్రంపై తిరగబడ్డ తెలంగాణ మహిళ..

Posted: 10/07/2021 03:03 PM IST
Telangana women unique protest against centre play bathukamma with lpg cylinders

యావత్ దేశవ్యాప్తంగా ప్రజలందరూ దేశి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆద్యాత్మిక భావనలో తన్మయత్వం పొందుతున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇదే అదునుగా భావించి వంటగ్యాస్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్రప్రభుత్వ, చమురు కంపెనీల తీరును నిరసిస్తూ తెలంగాణ మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాష్ట్రంలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు మొదలు కాగా, అదే పండుగ సంబరాన్ని తమ నిరసనను వ్యక్తం చేసేందుకు పూనుకున్నారు. తమ ఉత్సవాలతో పాటు నిరసనలను కూడా ఒకే వేదిక నుంచి కేంద్రానికి తెలియజేశారు.  

ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మహిళలు బతుకమ్మల మధ్య సిలిండర్లను పెట్టి తమ నిరసనను తెలిపారు. ఇక పెంచిన గ్యాస్ ధరలకు.. రోజురోజుకీ పైపైకి ఎగబాకుతున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ.. అప్పటికప్పుడే ట్యూన్లు కట్టి మరీ పాటలను పాడుతూ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. గతంలో దసరా, దీపావాళి, సంక్రాంతి లాంటి పండుగలు వచ్చినప్పుడు.. తాము కూడా పండుగ పూట ఉత్సాహంగా ఉండాలని ప్రభుత్వాలు తమకు పలు వస్తువులను కారుచౌకగా అందించేవని అన్నారు.

రేషన్ దుకాణాలలో కంది, శనగ పప్పులతో పాటు పంచధార, వంట నూనె, గోదుమలు ఇవీ కాక పలు రకాల వస్తువులను కూడా మార్కెట్ రేటు కన్నా చౌకగా అందించేవారని.. పండగ అంటే అందరిదనీ.. దీంతో పేదవాళ్లు కూడా పండగ జరుపుకోవాలని ప్రభుత్వాలు ఇలా తమకు చౌకగా అందించేవన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రభుత్వాలు రేషన్ దుకాణాలను బియ్యానికి మాత్రమే పరిమితం చేశాయని, పేదలు గొదుమ రెట్టెలు, శనగపిండితో వంటకాలు చేసుకోకూడదనా.? చక్కర, వంట నూనెలను అసలు అందించమే మానేశాయని వాపోయారు.

ఇది చాలదన్నట్లు ఇక పండగ వేళ.. తమ జేజులోని డబ్బులన్నీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ పేరుతో లాక్కోవడం మరింత దారుణమన్ని అక్షేపించారు. బతుకమ్మల మధ్యలో సిలిండర్‌ పెట్టి ఆటలాడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా.. గడిచిన రెండు నెలల్లో వంటగ్యాస్‌ ధరలు నాలుగుసార్లు పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గ్యాస్‌ సిలిండర్‌పై రూ.205 పెరిగింది. దీంతో సామాన్యులకు గ్యాస్‌ ధరలు గుదిబండలా మారాయి. మళ్లీ కట్టెలపొయ్యిపై వంట చేసుకునే రోజులు వస్తాయేమోననంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles